Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ ను ఘనంగా విజయంతో ఆరంభించింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్. ఆర్సీబీకి షాకిస్తూ.. తొలి పోరులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చెన్నై గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.
ఐపీఎల్ 2024 సీజన్ ను ఘనంగా విజయంతో ఆరంభించింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్. ఆర్సీబీకి షాకిస్తూ.. తొలి పోరులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చెన్నై గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.
Somesekhar
క్రికెట్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా జాతర మెుదలైంది. భారీ హంగులతో అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ 2024 సీజన్ తోలి మ్యాచ్ లోనే సత్తాచాటింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్. ఇక ఎన్నో ఆశలతో ఈసారైనా కప్ కొట్టాలని బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి మ్యాచ్ లోనే షాక్ తగిలింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజయంతో ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించాడు. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. మరి తొలి మ్యాచ్ లోనే చెన్నై విజయం సాధించడానికి 5 ప్రధాన కారణలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.
CSK విజయానికి 5 ప్రధాన కారణాలు
ఐపీఎల్ 2024 సీజన్ ను చెన్నై విజయంతో ఆరంభించింది. పటిష్టమైన బెంగళూరు టీమ్ ను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్. మ్యాచ్ ముందు వరకు గాయంతో బాధపడిన అతడు గొప్పగా పుంజుకుని ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ తొలి నాలుగు ఓవర్లలో మ్యాచ్ పై పట్టుసాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ లు తొలి వికెట్ కు 4.3 ఓవర్లలోనే 41 రన్స్ పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పి మంచి జోరుమీదున్నారు. కానీ ముస్తాఫిజుర్ బౌలింగ్ కు దిగాకా.. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. రెండు బంతుల వ్యవధిలోనే స్పీడ్ మీదున్న డుప్లెసిస్(35), రజత్ పాటిదార్(0)ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత స్పెల్ లో విరాట్ కోహ్లీ(21), కామెరూన్ గ్రీన్(18)ని కూడా ఔట్ చేసి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. తన కోటా 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి మెరుపు ఆరంభం దక్కింది. చిన్న భాగస్వామ్యమే అయినప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ పడిపోవడంతో.. తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ పై ఎలాంటి ఒత్తిడి లేకుండాపోయింది. చెన్నై ఓపెనర్లు గైక్వాడ్-రచిన్ రవీంద్ర జోడీ తొలి వికెట్ కు 3.6 ఓవర్లలోనే 38 పరుగులు పిండుకుంది. ఈ అద్భుతమైన ఆరంభాన్ని సద్వినియోగపరుచుకుంటూ మిగతా బ్యాటర్లు పనిని పూర్తిచేశారు. రుతురాజ్(15), రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగుల థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, చెన్నై విజయం ఖాయం చేసుకుంది.
సాధించాల్సింది చిన్న లక్ష్యమేమీ కాదు.. కానీ వచ్చిన బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేసి విజయం వైపు జట్టును తీసుకొచ్చారు. కానీ గ్రీన్ వరుస ఓవర్లలో రహానే(27), డార్లీ మిచెల్(22)ను ఔట్ చేయడంతో చెన్నై శిబిరంలో కాస్త ఒత్తిడి మెుదలైంది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన చిచ్చర పిడుగు శివమ్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. అతడి తోడు సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా(25*) రాణించడంతో.. చెన్నై లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో తేలికగా ఛేదించింది. వీరిద్దరు ఐదో వికెట్ కు 37 బంతుల్లో 66 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ కు విజయాన్ని అందించారు. దుబే 28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 34 రన్స్ తో అజేయంగా నిలిచాడు.
బ్యాటింగ్ లో విఫలమైన ఆర్సీబీ.. అదే తీరును బౌలింగ్ లోనూ చూపించింది. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, కామెరూన్ గ్రీన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లకు తోడు కర్ణ్ శర్మ, మయాంక్ డగర్, యశ్ దయాల్ బౌలింగ్ దళం ఏ మాత్రం చెన్నై బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. 173 రన్స్ చిన్న లక్ష్యమేమీ కాదు.. అయినప్పటికీ దాన్ని కాపాడుకోవడంతో పూర్తిగా విఫలం అయ్యారు. మరీ ముఖ్యంగా సిరాజ్, జోసెఫ్, కర్ణ్ శర్మ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వికెట్లు తీయడం అటుంచితే.. రన్స్ కట్టడి చేయలేకపోయారు. చెన్నై బ్యాటర్లు స్వేచ్ఛంగా షాట్లు ఆడుతూ.. పరుగులు పిండుకుంటూ, లక్ష్యాన్ని ఛేదించారు. దాదాపు 19 ఓవర్లు వేసి కేవలం 4 వికట్లు పడగొట్టారు అంటేనే ఆర్సీబీ బౌలింగ్ ఎంత వీక్ గా ఉందో అర్ధమౌతోంది.
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కు చెన్నై కెప్టెన్ గా ప్రమోషన్ లభించింది. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ కు పగ్గాలు అప్పగించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఐపీఎల్ లాంటి మెగాటోర్నీలో కుర్ర ప్లేయర్ నాయకత్వ ఒత్తిడిని తట్టుకోగలడా? జట్టును ముందుకు నడిపించగలడా? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. కానీ తొలి మ్యాచ్ లోనే ఈ ప్రశ్నలన్నింటికీ.. ఆన్సర్ ఇచ్చేశాడు గైక్వాడ్. అద్భుతమైన కెప్టెన్సీలో తనలో కూడా ఓ నాయకుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ లో విఫలం అయినా గానీ.. సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. బౌలర్లను ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో రుతురాజ్ కు బాగా తెలుసని ఈ మ్యాచ్ ద్వారా రుజువైంది. అతడి కెప్టెన్సీ కూడా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. మరి తొలి మ్యాచ్ లోనే చెన్నై విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Talk about living upto the Impact Player tag! 👏 👏
That was one fine knock from Shivam Dube in the chase! 👌 👌
Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @IamShivamDube | @ChennaiIPL pic.twitter.com/207zz2Jz8l
— IndianPremierLeague (@IPL) March 22, 2024
ఇదికూడా చదవండి: స్ట్రెక్చర్ పై నుండి.. నేరుగా మెరుపు బౌలింగ్ వరకు! ఇది కదా పట్టుదల అంటే!