Somesekhar
ఈసారైనా కప్ కొట్టాలన్న కసితో ఈ ఐపీఎల్ సీజన్ లోకి అడుగుపెట్టింది ఆర్సీబీ. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్ లోనే పరాజయం పలకరించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఈసారైనా కప్ కొట్టాలన్న కసితో ఈ ఐపీఎల్ సీజన్ లోకి అడుగుపెట్టింది ఆర్సీబీ. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్ లోనే పరాజయం పలకరించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Somesekhar
ఐపీఎల్ 17వ ఎడిషన్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. డుప్లెసిస్ సారథ్యంలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ చిచ్చరపిడుగు గ్లెన్ మాక్స్ వెల్ స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వరల్డ్ బెస్ట్ ఫినిషర్ దినేష్ కార్తిక్ లాంటి బ్యాటర్లు, మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, కర్ణ్ శర్మ వంటి బౌలర్లతో ఆర్సీబీ టీమ్ పటిష్టంగా ఉంది. దీంతో ఈసారైనా కప్ కొట్టాలన్న కసితో ఈ ఐపీఎల్ సీజన్ లోకి అడుగుపెట్టింది. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్ లోనే పరాజయం పలకరించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
RCB ఓటమికి 3 ప్రధాన కారణాలు
విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ ఈ ముగ్గురు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు త్రిమూర్తులు లాంటివారు. మ్యాచ్ ను ఒంటిచేత్తో మలుపుతిప్పగల సత్తా వీరి సొంతం. కానీ చెన్నైతో జరిగిన తొలి పోరులో వీరు మూకుమ్మడిగా విఫలమైయ్యారు. 20 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఓ సిక్స్ మాత్రమే కొట్టి 21 రన్స్ చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇక 77 రన్స్ కే 4 వికెట్లు పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడని అనుకున్న కామెరూన్ గ్రీన్ కూడా పూర్తిగా విఫలం అయ్యాడు. 22 బంతుల్లో 18 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. కాగా.. టోర్నీకి ముందు అందరి అంచనాలు పెంచేసిన మాక్స్ వెల్ డకౌట్ గా వెనుదిరిగి షాకిచ్చాడు. ఆర్సీబీకి చెందిన ఈ మూడుస్తంభాలు విఫలం కావడంతో జట్టుకు ఓటమితప్పలేదు.
ఆర్సీబీ 173 పరుగులు చేసింది.. టీ20 క్రికెట్ లో ఇది చిన్న లక్ష్యమేమీ కాదు. పైగా మహ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ యంగ్ బౌలర్ యశ్ దయాల్ టీ20ల్లో ఆడిన అనుభవం ఉన్న స్పిన్నర్ కర్ణ్ శర్మ వేలంలో కోట్లు కుమ్మరించి కొన్న విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ వంటి బౌలర్లతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ బలంగానే ఉంది. అయితే పేపర్ పై పటిష్టంగా కనిపించిన ఈ బౌలింగ్ దళం.. మ్యాచ్ వరకు వచ్చే సరికి పూర్తిగా విఫలం అయ్యింది. సిరాజ్ 4 ఓవర్లలో 38, జోసెఫ్ 3.4 ఓవర్లలో 38, కర్ణ్ శర్మ కేవలం రెండు ఓవర్లకే 24 పరుగులు సమర్పించుకున్నారు. భారత అన్ క్యాప్డ్ ప్లేయర్ మయాంక్ డగర్ గంజాయి వనంలో తులసిమెుక్కలా మెరిశాడు. రెండు ఓవర్లు వేసిన అతడు కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సీనియర్ బౌలర్ల చెత్త పర్ఫామెన్స్ తో ఆర్సీబీ తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఏ ఆటలోనైనా.. ఓ టీమ్ గెలవాలంటే ప్లేయర్లు బాగా ఆడితే సరిపోదు. ఆ జట్టు నాయకుడు వహించే పాత్ర కీలకమైంది. టీమ్ లోని ప్లేయర్లను పరిస్థితులకు తగ్గట్లుగా వాడుకుని ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంలోనే నిజమైన కెప్టెన్ విజయం దాగుంటుంది. అయితే ఈ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ సారథి డుప్లెసిస్ దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్ లో 35 రన్స్ తో పర్వాలేదనిపించిన ఇతడు.. కెప్టెన్సీ దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్ లో అతడు తీసుకున్న చెత్త నిర్ణయాల వల్లే ఓడిపోయింది టీమ్. మరీ ముఖ్యంగా టీమిండియా అన్ క్యాప్డ్ బౌలర్ మయాంక్ డగర్ కేవలం 2 ఓవర్లు వేసి 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంత అద్భుతంగా బౌలింగ్ చేసిన అతడికి ఆ తర్వాత బాల్ ఇవ్వకుండా పెద్ద తప్పు చేశాడు డుప్లెసిస్. ఇక బౌలర్లను కూడా అడ్డదిడ్డంగా వాడుకుని మ్యాచ్ ను చెన్నైకి అప్పగించాడు. మరి ఆర్సీబీ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Captain Ruturaj is happy, great start to the New generation of CSK. pic.twitter.com/LoIh4hB6n2
— Johns. (@CricCrazyJohns) March 22, 2024
ఇదికూడా చదవండి: IPL 2024 తొలి మ్యాచ్ లో CSK విజయానికి 5 ప్రధాన కారణాలు!