iDreamPost
android-app
ios-app

చేతిలో డబ్బుల్లేక కడుపులో బిడ్డను చంపుకున్నాం: బైరి నరేష్!

  • Published Aug 19, 2023 | 7:12 PM Updated Updated Aug 19, 2023 | 8:57 PM
  • Published Aug 19, 2023 | 7:12 PMUpdated Aug 19, 2023 | 8:57 PM
చేతిలో డబ్బుల్లేక కడుపులో బిడ్డను చంపుకున్నాం: బైరి నరేష్!

బైరి నరేష్.. అయ్యప్ప స్వామిని దూషించి హిందువుల మనోభావాలను గాయపరిచాడని దాడికి గురైన సంఘటనల ద్వారా ఇతని పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అనేక చర్చల్లో పాల్గొంటూ వివాదాస్పదమవుతూ వస్తున్నారు. మరో విషయం ఏంటంటే? ఆయన ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా అవతారమెత్తి రాజకీయ నాయకులను సైతం ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బైరి నరేష్ ఇటీవల ఐడ్రీమ్ ఛానెల్ లో ఇంటర్వ్యులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై వైరల్ గా మారింది.

అయితే ఇందులో యాంకర్ “భగవద్గీతపై ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను” అని ప్రమాణం చేసి చెప్పాలని బైరి నరేష్ ను కోరతాడు. దీనికి ఆయన సమాధానం చెప్పకుండా తిరస్కరించాడు. ఇదే కాకుండా బైరి నరేష్ మునుపెన్నడు మీడియాకి చెప్పని చాలా విషయాలు ఇందులో వెల్లడించినట్లు ఇంటర్వ్యూ ప్రోమోలో తెలుస్తుంది. దీంతో పాటు ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో యాంకర్ కి బైరి నరేష్ మధ్య హోరాహోరీ చర్చ జరిగినట్లు ప్రోమో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఒకరికొకరు వాగ్వాదం, దూషణలు చేసుకున్నారు.

మరో విషయం ఏంటంటే? బైరి నరేష్ ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు తన గతం గురించి చెప్పుకొచ్చారు. తన ఇల్లు కుటుంబం భార్య గురించి చాలా విషాదకర విషయాలు బయట పెట్టారు బేరి నరేష్. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆర్థిక భారం మోయలేక కడుపులో ఉన్న బిడ్డను సైతం చిదిమేసుకున్నట్లుగా బైరి నరేష్ చెప్పారు. ఇక ఆపరేషన్ చేసిన తర్వాత కుట్ల నుండి రక్తం కారుతున్నప్పుడు తన లోపల బాధను దిగమింగుకోలేక భార్య ఫోన్ చేసి ఏడ్చిన సంఘటన గుర్తుచేసుకొని బైరి నరేష్ కన్నీటి పర్యంతమయ్యారు.

 ఇవన్నీ చెబుతూ బైరి నరేష్ తో పాటు యాంకర్ సైతం భావోద్వేగానికి గురై కన్నీళ్లు కార్చారు. ఇంకా ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో యాంకర్ “అసలు ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు మూసి మరోవైపు పొగ అన్నట్లుగా..  అసలు సమాజానికి ఏమైంది, ఒకవైపు ఆర్జీవి మరోవైపు బైరి నరేష్” డైలాగ్ తో యాంకర్ ను పోలుస్తూ విడుదల చేసిన ఈ ప్రోమోకు మంచి స్పందన వస్తోంది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే యాంకర్ బైరి నరేష్ భార్యను ఫోన్ లైన్లో అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలు చాలా ఆసక్తి కలిగించేలా ఉన్నట్లు ప్రోమో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.

దీంతో పాటు పళ్ళు రాలుతాయి అన్న బైరి నరేష్ మాటలకు మిమ్మల్ని కొట్టినపుడు ఎన్ని పళ్ళు రాలాయ్ అంటూ యాంకర్ ఇచ్చిన దీటైన సమాధానానికి వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ఇదే కాకుండా బైరి నరేష్ మునుపేన్నడు ప్రస్తావించని విషయాలు హిందుత్వం పట్ల, సమాజం పట్ల, తన అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు వంటి చాలా విషయాలు ఇందులో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇలా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ ప్రోమో పూర్తి ఇంటర్వ్యూలో ఈ రోజు సాయంత్రం ఐడ్రీమ్ ఛానెల్ లో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: వీడియో: బోరున ఏడ్చేస్తూ అనసూయ షాకింగ్ పోస్ట్! ఏమైందంటే?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom