iDreamPost
android-app
ios-app

69 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్న WWE సూపర్ స్టార్!

  • Author Soma Sekhar Published - 07:05 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 07:05 PM, Wed - 26 July 23
69 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్న WWE సూపర్ స్టార్!

హల్క్ హోగన్.. WWE సూపర్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. WWE హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నాడు హల్క్ హోగన్. ఇతడి అసలు పేరు టెర్రీ జీనీ బొలియా కానీ రింగ్ నేమ్ నే తన పేరుగా మార్చుకుని WWE సూపర్ స్టార్ గా ఎదిగాడు. కాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హోగన్ పెళ్లి వార్తలతో తరచుగా న్యూస్ లో నిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఇతడు తాజాగా 69 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.

WWE సూపర్ స్టార్ హల్క్ హోగన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. 69 ఏళ్ల వయసులో తన ప్రేయసి అయిన 45 ఏళ్ల స్కై డైలీని వివాహమాడనున్నాడు. కాగా.. ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులు ఇచ్చాడు హల్క్. 1983 లో లిండా క్లారిడ్జ్ ను తొలిసారిగా పెళ్లి చేసుకున్నాడు హోగన్. అయితే ఆమెతో అభిప్రాయ భేదాలు రావడంతో.. 2009లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరానికే జెన్నిఫర్ మెక్ డేనియల్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. 2021లో జెన్నిఫర్ కి సైతం విడాకులిచ్చాడు.

ఆ తర్వాత స్కై డైలీతో డేటింగ్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచిన అతడు తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దాంతో అతడిపై కొందరు నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. కానీ అవేవీ పట్టించుకుకోని హోగన్.. నా జీవితం నా ఇష్టం అంటూ వారికి సమాధానం ఇచ్చాడు. కాగా.. స్కై డైలీ అకౌంటెంట్ గా, యోగా ట్రైనర్ గా కొనసాగుతోంది. ఇక హోగన్ కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. ఇక WWE కి రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత హల్క్ కూడా నటుడిగానే తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. మరి 69 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్న ఈ WWE సూపర్ స్టార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hulk Hogan (@hulkhogan)

 

View this post on Instagram

 

A post shared by Hulk Hogan (@hulkhogan)


ఇదికూడా చదవండి: చైనా స్కూల్ పుస్తకాల్లో భారతీయుడిపై పాఠం! ఎవరీ దేవ్ రాటూరి?