iDreamPost

చైనా స్కూల్ పుస్తకాల్లో భారతీయుడిపై పాఠం! ఎవరీ దేవ్ రాటూరి?

  • Author Soma Sekhar Published - 04:51 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 04:51 PM, Wed - 26 July 23
చైనా స్కూల్ పుస్తకాల్లో భారతీయుడిపై పాఠం! ఎవరీ దేవ్ రాటూరి?

సాధారణంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వ్యక్తుల జీవితాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తమ శత్రు దేశానికి చెందిన వ్యక్తుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి ఓ అరుదైన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య పరిస్థితులు సఖ్యతగా లేవు. చైనా ఎప్పుడూ యుద్దానికి కాలుదువ్వేందుకు సిద్దమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ కు చెందిన 46 ఏళ్ల దేవ్ రాటూరి జీవిత చరిత్రను చైనా స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చడం గమనార్హం. మరి హోటల్లో వెయిటర్ నుంచి చైనాలో మోస్ట్ పాపులర్ నటుడిగా ఎదిగిన దేవ్ రాటూరి సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.

దేవ్ రాటూరి.. ఈ పేరు గురించి మనకు పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే ఆయన పుట్టింది ఇండియాలోనే అయినా.. పెరిగింది, ఉంటుంది చైనాలో కాబట్టి. ఉత్తరాఖండ్ లో ఓ చిన్న గ్రామంలో జన్మించాడు దేవ్ రాటూరి. అతడికి చిన్నతనం నుంచే బ్రూస్ లీ అంటే చాలా ఇష్టం. దాంతో కరాటే ఛాంపియన్ కావాలని కలలు కన్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అడ్డుగా నిలిచాయి. దాంతో కుటుంబ పోషణ కోసం ఢిల్లీలో దశాబ్దం పాటుగా కూలీగా మారాడు దేవ్. ఈ క్రమంలనే 2005లో చైనాలోని ఓ భారత రెస్టారెంట్ లో వెయిటర్ గా ఉద్యోగం వచ్చింది. దాంతో తొలిసారి చైనాలో అడుగుపెట్టాడు దేవ్.

అలా నెలకు రూ. 10 వేల జీతంతో ఉద్యోగం మెుదలు పెట్టాడు దేవ్ రాటూరి. కానీ తన కలను మాత్రం విడిచిపెట్టకుండా కరాటేలో శిక్షణ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆర్థిక పరిస్థితులు అతడిని వెనక్కు లాగాయి. దాంతో చేసేదేమీ లేక తన ఆశలను పక్కన పెట్టేశాడు. కాగా.. 2013లో ప్రముఖ హోటల్లో మేనేజర్ గా ఉద్యోగం పొందాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక.. చైనాలోని షియాన్ సిటీలో ‘రెడ్ ఫోర్ట్’ అనే పేరుతో సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాడు దేవ్ రాటూరి. అలా తన రెస్టారెంట్ ను చూసుకుంటున్న క్రమంలో 2017లో దేవ్ రెస్టారెంట్ కు ఓ చైనా డైరెక్టర్ వచ్చాడు. అక్కడ దేవ్ ను చూసి సినిమాల్లో నటిస్తావా? అని అడిగాడు. అలా ‘స్వాట్’ అనే టీవీ సిరీస్ లో ఓ చిన్న పాత్రలో నటించాడు.

ఇక ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో పాటుగా.. దేవ్ నటనకు మంచి పేరొచ్చింది. దాంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు దేవ్ 35 చైనీస్ సినిమాలతో పాటుగా సీరియల్స్ లో కూడా నటించాడు. ప్రస్తుతం చైనా సినిమా ఇండస్ట్రీలో దేవ్ ఒక స్టార్. ఇక మూవీస్ ద్వారా వచ్చిన పాపులారిటీ ఆయన బిజినెస్ కు కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో ఇప్పుడు ఏకంగా 8 రెస్టారెంట్లకు ఓనర్ గా మారారు దేవ్. 18 సంవత్సరాల క్రితం వెయిటర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన దేవ్.. బెస్ట్ సీఈవోగా, పాపులర్ నటుడిగా చైనాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో దేవ్ స్ఫూర్తిదాయక జీవిత ప్రయాణాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో.. షాంగ్జీ ప్రావిన్స్ ఏడో తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ పుస్తకంలో దేవ్ రాటూరిపై ఓ పాఠ్యాంశాన్ని తీసుకువచ్చింది.

కాగా.. దేవ్ 1998లోనే బాలీవుడ్ లో నటించేందుకు ప్రయత్నించారట. అప్పట్లో ఓ హిందీ సినిమాకి ఆడిషన్ ఇవ్వగా.. ఆయన సెలెక్ట్ కాలేదట. ఇక తన రెస్టారెంట్లలో మాతృదేశానికి చెందిన పైగా తన సొంత ఊరికి చెందిన వ్యక్తులను స్టాఫ్ గా నియమించుకుని తన ప్రేమను చాటుకున్నారు. మరి చైనా పుస్తకాల్లో ఓ భారతీయుడి జీవితాన్ని పాఠంగా చేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మణిపూర్‌లో మరో దారుణం.. మహిళపై BSF జవాన్‌ లైంగిక వేధింపులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి