Dharani
ఎచ్చులకు పోయి.. ఇండియాతో సున్నం పెట్టుకున్న మాల్దీవులు ఇప్పటికే తగిన ఫలితం అనుభవిస్తుండగా.. తాజాగా వరల్డ్ బ్యాంక్ మాల్దీవ్స్‌పై నిరసన వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కీలక హెచ్చరికలు కూడా చేసింది. ఆ వివరాలు..
ఎచ్చులకు పోయి.. ఇండియాతో సున్నం పెట్టుకున్న మాల్దీవులు ఇప్పటికే తగిన ఫలితం అనుభవిస్తుండగా.. తాజాగా వరల్డ్ బ్యాంక్ మాల్దీవ్స్‌పై నిరసన వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కీలక హెచ్చరికలు కూడా చేసింది. ఆ వివరాలు..
Dharani
మాల్దీవ్స్.. ఒకప్పుడు మన దేశంలోని సెలబ్రిటీలంతా ఈ పేరును కలవరించేవారు. భారతీయులకు బెస్ట్ వెకేషన్ స్పాట్ అంటే మాల్దీవ్స్ పేరు ఎక్కువగా వినిపించేది. సౌత్, నార్త్‌తో సంబంధం లేకుండా సినిమా సెలబ్రిటీలంతా మాల్దీవ్స్‌కు క్యూ కట్టేవారు. పైగా ఈ దేశానికి అత్యధిక ఆదాయం కూడా పర్యాటక రంగం నుంచే వచ్చేది. అయితే మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ మంత్రులు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలను రాజేశాయి. దీనిపై భారతీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు, బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. చివరకు మాల్దీవ్స్‌కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ బ్యాంకు మాల్దీవ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. భారత్‌తో పెట్టుకుంటే ఇలానే అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
మాల్దీవ్స్‌కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం మాత్రమే. అయితే మోదీ లక్షద్వీప్ పర్యటనను ఎగతాళి చేస్తూ.. ఆ దేశ మంత్రులు కామెంట్స్ చేయడంతో.. భారతీయులు ఎవరు ఆ దేశం వైపు తొంగి చూడటం లేదు. దాంతో మాల్దీవ్స్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ మాల్దీవ్స్ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ దేశం తన స్థాయికి మించి ఖర్చు చేస్తోందని.. తీవ్ర ఆర్థిక సంక్షోభం ముప్పు దిశగా అడుగులు వేస్తోందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం 512 మిలియన్ డాలర్లుగా ఉన్న మాల్దీవుల వార్షిక రుణ సేవల అవసరాలు 2026 నాటికి1.07 బిలియన్ డాలర్లకు చేరుతాయని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ (మాల్దీవులు, నేపాల్, శ్రీలంక) ఫారిస్ హెచ్ హడాద్-జెర్వోస్ హెచ్చరిక జారీ చేశారు. మాల్దీవులు ఆర్దికపరంగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని ఆయన ట్వీట్ చేశారు.
మాల్దీవుల ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా పర్యాటక రంగం కుదేలయ్యింది. గతేడాది నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈలోపు ఆ దేశ మంత్రులు ఇండియా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి.. తమ ఆదాయానికి తామే గండి కొట్టుకున్నారు. ఈ క్రమంలో హడాద్-జెర్వోస్ మాట్లాడుతూ.. ‘‘దశాబ్దాలుగా మాల్దీవుల తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తోంది.. దేశ వ్యయం వేగంగా పెరగడం.. సబ్సిడీలు ద్రవ్య లోటును పెంచాయి.. ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి, అధిక రుణ భారానికి దారితీసింది’’ అని తెలిపారు. మాల్దీవులు 2024, 2025లో 512 మిలియన డాలర్ల వార్షిక రుణ సేవలను నిర్వహించవలసి ఉంటుందని, ఇది 2026 నాటికి 1.07 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.
‘మాల్దీవులు అధిక రుణ ముప్పు, ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొంటుంది.. ఇది సంక్షోభానికి దారితీసుంది’ అని ఆయన హెచ్చరించారు. సంక్షోభాన్ని నివారించడానికి పలు ఆర్ధిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మాల్దీవులు ఆర్థిక వ్యస్థలో కీలకమైన పర్యాటక రంగం ఆదాయం గతేడాది చివరి నుంచి తగ్గిపోయింది. ఇందుకు ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలే కారణమంటూ ప్రపంచ బ్యాంకు కూడా ఆరోపించింది.