iDreamPost
android-app
ios-app

నెట్‌ఫ్లిక్స్‌పై 1419 కోట్ల దావా.. వెబ్‌సిరీస్‌లో అలాంటి సీన్స్ ఉండడంతో..

  • Published Jun 10, 2024 | 6:12 PM Updated Updated Jun 10, 2024 | 6:12 PM

Woman Sues Netflix: నెట్ ఫ్లిక్స్ పై 1419 కోట్ల పరువు నష్టం దావా వేసిందో మహిళ. వెబ్ సిరీస్ లో తప్పుడు సన్నివేశాలు ఉండడమే అందుకు కారణం. ఆ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఆ మహిళని పోలి ఉండడం.. అందులో సన్నివేశాలు తప్పుడుగా ఉండడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.

Woman Sues Netflix: నెట్ ఫ్లిక్స్ పై 1419 కోట్ల పరువు నష్టం దావా వేసిందో మహిళ. వెబ్ సిరీస్ లో తప్పుడు సన్నివేశాలు ఉండడమే అందుకు కారణం. ఆ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఆ మహిళని పోలి ఉండడం.. అందులో సన్నివేశాలు తప్పుడుగా ఉండడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.

నెట్‌ఫ్లిక్స్‌పై 1419 కోట్ల దావా.. వెబ్‌సిరీస్‌లో అలాంటి సీన్స్ ఉండడంతో..

నెట్ ఫ్లిక్స్ గురించి తెలిసిందే. ఈ ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ స్ట్రీమింగ్ అవుతాయి. చిన్న పిల్లల కంటెంట్ నుంచి అడల్ట్ కంటెంట్ వరకూ అన్నీ ప్రదర్శితమవుతాయి. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లలో అశ్లీల సన్నివేశాలు ఎక్కువైపోయాయి. ఇదిలా ఉంటే ఒక మహిళ నెట్ ఫ్లిక్స్ సంస్థపై 1419 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దీనికి కారణం ఆ సిరీస్ అలాంటి సీన్స్ ఉండడమే.. అది కూడా ఆమెను ఉద్దేశించి ఉండడమే. నెట్ ఫ్లిక్స్ సంస్థపై ఓ మహిళ 170 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేసింది. స్కాట్ ల్యాండ్ కి చెందిన ఫియోనా హార్వే అనే మహిళ.. నెట్ ఫ్లిక్స్ సంస్థపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. నిజ జీవిత కథ అని ప్రమోట్ చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ కనీసం.. కమెడియన్ రిచర్డ్ గాడ్ చెప్పిన కథను వెరిఫై చేయలేదని ఆమె ఆరోపించారు.

‘బేబీ రెయిన్ డీర్’ వెబ్ సిరీస్ ఏప్రిల్ నెలలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. దీనికి అంతర్జాతీయంగా బోలెడంత వ్యూయర్ షిప్ వచ్చింది. అయితే ఈ సిరీస్ లో తన పరువు దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని హార్వే ఆరోపించారు. మార్తా స్కాట్ అనే మహిళ వల్ల డానీ ఎలా వేధింపులకు గురయ్యాడో అని కమెడియన్ రిచర్డ్ గాడ్ చెప్పిన దాని ప్రకారం వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ రిలీజైన కొద్దిరోజుల్లోనే ఈ సిరీస్ లో ఉన్న మార్తా స్కాట్ క్యారెక్టర్.. రియల్ లైఫ్ లో ఫియోనా హార్వేదని ప్రేక్షకులు గుర్తించారు. అది వైరల్ అవ్వడంతో హార్వే కోర్టులో నెట్ ఫ్లిక్స్ పై 1419 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. బేబీ రెయిన్ డీర్ సిరీస్ లో తనను నేరస్తురాలిగా ముద్ర వేశారని.. అబద్ధాలు చూపించారని ఆరోపించారు.

తానేమీ రిచర్డ్ పై లైంగిక వేధింపులకు పాల్పడలేదని.. తానసలు జైలుకే వెళ్లలేదని ఆమె వెల్లడించారు. ఈ సిరీస్ లో తన పాత్రను తప్పుగా చూపించారని ఆమె ఆరోపించారు. ఈ సిరీస్ వల్ల తనకు బెదిరింపులు వస్తున్నాయని.. చంపేస్తామని అంటున్నారని.. డిప్రెషన్ కి, భయాందోళనకు గురయ్యానని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించినందుకు.. నిర్లక్ష్యం వహించినందుకు.. మానసికంగా క్షోభకు గురి చేసినందుకు గాను నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి 1419 కోట్ల రూపాయలు పరిహారం ఇప్పించాలని ఆమె కోరారు. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని చెబుతుంది.

రిచర్డ్ గాడ్ కి కథ చెప్పే హక్కు ఉందని.. గాడ్ తమకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు అని చెప్పాడని.. అతని జీవిత అనుభవాలనే తాము చూపించామని నెట్ ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఈ విషయంలో హార్వేకి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. కాగా బేబీ రెయిన్ డీర్ వెబ్ సిరీస్ లో మార్తా స్కాట్ పాత్రలో జెస్సికా నటించగా.. డానీ పాత్రలో రిచర్డ్ గాడ్ నటించాడు. డానీ లండన్ పబ్ లో బార్ టెండర్ గా పని చేస్తుంటాడు. మార్తా అనే మహిళకు కప్పు టీ ఆఫర్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం బంధంగా మారుతుంది. అప్పటి నుంచి మార్తా డానీ వెంట పడుతుంది. ఆ తర్వాత అతన్ని లైంగికంగా వేధించడం మొదలుపెడుతుంది. ఈ సిరీస్ రెండు నెలల క్రితం విడుదలవ్వగా విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.