iDreamPost
android-app
ios-app

రూ.2,800 కోట్లు లాటరీ గెలిచాడు.. డబ్బిచ్చేందుకు తిర‌స్క‌రించిన కంపెనీ.. ఎందుకంటే?

  • Published Feb 21, 2024 | 3:33 PM Updated Updated Feb 21, 2024 | 3:33 PM

Man Won Powerball Lottery: అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేదు. అదృష్టం లేకుంటే గడపదాకా వచ్చిన లక్ష్మీదేవి అటు నుంచి అటే వెన్కక్కి వెళ్తుంది.

Man Won Powerball Lottery: అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేదు. అదృష్టం లేకుంటే గడపదాకా వచ్చిన లక్ష్మీదేవి అటు నుంచి అటే వెన్కక్కి వెళ్తుంది.

రూ.2,800 కోట్లు లాటరీ గెలిచాడు.. డబ్బిచ్చేందుకు తిర‌స్క‌రించిన కంపెనీ.. ఎందుకంటే?

మనిషి డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటాడు. ప్రతి ఒక్కరికీ లక్షలు, కోట్లు సంపాదించి సొసైటీలో గొప్పగా బ్రతకాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. కొంతమంది ఒక్కసారే లక్షాధికారులు కావాలనే తపనతో లాటరీలు కొంటుంటారు. కోట్ల మందిలో అదృష్టం ఒక్కరికే దక్కుతుంది. అదృష్టవంతులకు లాటరీ రూపంలో కోట్లు కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదృష్టం కలిసి వచ్చిన వారు రాత్రికి రాత్రే లక్షాధికారి, కోటీశ్వరులవుతారు. కొంతమందికి అదృష్టం దారుణంగా వెంటాడుతుంది..  గడపదాకా వచ్చిన లక్ష్మీదేవి అటునుంచి అటే వెళ్లిపోతుందంటారు.. అచ్చం అలాంటి ఘటనే ఓ వ్యక్తి విషయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని వాషింగ్టన్ లో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో జాన్స్ చీక్స్ అనే వ్యక్తి ఏకంగా రూ.2800 కోట్ల గెల్చుకున్నాడు. పవర్ బాల్ అండ్ డీసీ లాటరీ లో ఈ డబ్బు గెల్చుకున్నాడు. 2023 జనవరి 6న ఈ లాటరీ కొన్ని జాన్స్ చీక్స్ కి 340 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో 2800 కోట్లు) డ్రాలో గెలిచినట్లు డీసీ లాటరీ వెబ్ సైట్ లో కనిపించింది. దీంతో జాన్స్ చీక్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ డబ్బులు తీసుకునేందుకు జాన్స్ చీక్స్ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించగా దిమ్మతిరిగే జవాబు చెప్పారు. లాటరీ గెలిచిన వార్తను డీసీ లాటరీ కంపెనీ వారు ఖండించారు. పొరపాటున చీక్స్ లాటరీ నెంబర్ వెబ్ సైట్ లో పబ్లిష్ అయ్యిందని.. అందువల్ల ఆ మొత్తాన్ని ఇవ్వలేమని చెప్పింది.

లాటరీలో డబ్బు గెలిచిన ఆనందం లేకుండా చేసిన కంపెనీపై జాన్స్ చీక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఈ క్రమంలోనే టాలరీ టికెట్ తో గేమింగ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా.. అతడి ఫిర్యాదును సంస్థ తిరస్కరించింది. ఆ టికెట్ సరైనది కాదని, ఆ లాటరీ చెల్లుబాటు కాదని, అందుకే తిరస్కరించామని సదరు కంపెనీ వివరణ ఇచ్చినట్లు లాటరీ అండ్ గేమింగ్ కార్యాలయం తెలిపింది. ఈ విషయంపై జాన్స్ చీక్స్ మాట్లాడుతూ.. లాటరీ ఏజెంట్ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, లాటరీ చెల్లుబాటు కాదని పక్కనే ఉన్న చెత్తబుట్టలో పడవేయాలని హేళనగా మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కంపెనీపై ఎనిమిది రకాల కేసులు వేసినట్లు తెలిపాడు. తనకు వడ్డీతో సహా రూ.2800 కోట్లకు పైగా రావాలని, లాటరీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.