Venkateswarlu
ఆయన కిందపడే సమయంలో ఆ టేబుల్‌ను ఢికొట్టడం వల్ల టేబుల్, టేబుల్‌తో పాటు దానిపై ఉన్న తిండి పదార్ధాలు చెల్లా చెదురుగా పడి ఉంటాయని జెనరల్ ఎస్వీఆర్ అభిప్రాయపడింది.
ఆయన కిందపడే సమయంలో ఆ టేబుల్‌ను ఢికొట్టడం వల్ల టేబుల్, టేబుల్‌తో పాటు దానిపై ఉన్న తిండి పదార్ధాలు చెల్లా చెదురుగా పడి ఉంటాయని జెనరల్ ఎస్వీఆర్ అభిప్రాయపడింది.
Venkateswarlu
రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆదివారం రాత్రి అపార్ట్‌మెంట్ గదిలోని బెడ్‌రూములో ఆయన స్ప్రహ తప్పి పడిపోయారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా.. ఆయన నేలపై పడి ఉన్నారు. రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ ‘జెనరల్ ఎస్వీఆర్’ తెలిపిన వివరాల మేరకు.. పుతిన్ బెడ్‌రూములోని టేబుల్, టేబుల్ మీది ఉండాల్సిన తిండి పదార్థాలు చెల్లా చెదురుగా కింద పడి ఉన్నాయి.
ఆయన కిందపడే సమయంలో ఆ టేబుల్‌ను ఢికొట్టడం వల్ల టేబుల్, టేబుల్‌తో పాటు దానిపై ఉన్న తిండి పదార్ధాలు చెల్లా చెదురుగా పడి ఉంటాయని జెనరల్ ఎస్వీఆర్ అభిప్రాయపడింది. పుతిన్ టేబుల్ మీద పడ్డంతో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం కారణంగా ఆయన భద్రతా సిబ్బంది లోపలికి వచ్చారు. అప్పటికి పుతిన్ కళ్లు గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న పెద్ద డాక్టర్లను పిలిపించారు. పుతిన్‌ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు గుర్తించారు. అనంతరం అక్కడినుంచి ప్రత్యేక వైద్య గదిలోని ఐసీయూకు ఆయన్ని తరలించారు. డాక్టర్లు సకాలంలో స్పందించటం వల్ల పెను ప్రమాదం తప్పింది.
పుతిన్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటుగానే ఉంది. అయితే, ఈ సమాచారం అందించిన రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ ‘జెనరల్ ఎస్వీఆర్’కు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. దాన్ని క్రెమ్లిన్ ఇన్‌సైడర్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక, పుతిన్ అనారోగ్యంపై క్రెమ్లిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు పుతిన్‌కు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందన్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి, పుతిన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.