iDreamPost

వీడియో: రన్‌వే నుంచి అదుపుతప్పిన విమానం.. సముద్రంలోకి దూసుకెళ్లి…

  • Published Nov 23, 2023 | 11:50 AMUpdated Nov 23, 2023 | 11:50 AM

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా తరుచూ విమాన ప్రమాదాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా తరుచూ విమాన ప్రమాదాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

  • Published Nov 23, 2023 | 11:50 AMUpdated Nov 23, 2023 | 11:50 AM
వీడియో: రన్‌వే నుంచి అదుపుతప్పిన విమానం.. సముద్రంలోకి దూసుకెళ్లి…

ఇటీవల తరుచూ విమాన ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. టెకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత సాంకేతిక లోపాలు తలెత్తడంతో విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. కొన్నిసార్లు గాల్లోకి ఎగిరి తర్వాత ఇబ్బందులు తలెత్తడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. టెకాఫ్ అయిన తర్వాత వాతావరణంలో ఒక్కసారే మార్పులు రావడం, పక్షులు ఢీ కొట్టడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయానికి ప్రమాదాన్ని గుర్తించి పైలెట్లు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ప్రయాణికులు ప్రాణాలు కాపాడుతున్నారు. ఓ విమానం ల్యాండిగ్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్‌వే నుంచి ఒక్కసారిగా అదుపుతప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకువెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన హవాయిలో మైరన్ కోర్ బేస్ లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కోర్ ప్రతినిధి ఓర్లాండ్ ప్రేజ్ తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మింది మంది సిబ్బంది ఉండగా.. కోస్ట్ గార్డు సిబ్బంది వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని పేర్కొన్నారు. అయితే బోటింగ్ చేస్తున్నవారు విమానం తెలుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

అమెరికా నౌకాదళంలోని పీ-8 ఏ పొసెడాన్ విమానం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. సబ్ మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయడంలో ఇది దిట్ట. భారీగా ఇంటెలిజెన్స్ ను సైతం ఈ విమానం సెకరిస్తుంది. క్రూజ్ క్షిపణులు, టోర్పెడోలను తీసుకువెళ్లే కెపాసిటి ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఎలాంటి ఆయుదాలు ఉన్నాయన్న విషయం కోర్ ప్రతినిధి వెల్లడించలేదు. మెరైన్ కోర్ ప్రధాన స్థావరం హవాయిలో ఉంది. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్ స్క్వాడ్రన్ కనోహె బే కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఈ విమానం నీట మునిగినా కూడా ఎలాంటి ప్రమాదం జరగదని అంటున్నారు. ఈ ఘటనకు కారణం ఇంకా తెలియరాలేదు. ప్రపంచంలో పీ8 విమానాలను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, భారత్ సైన్యాలు కూడా వాడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి