iDreamPost
android-app
ios-app

వీడియో: ఎయిర్‌షో‌లో అపశృతి.. ఢీకొన్న రెండు విమానాలు..!

  • Published Jun 03, 2024 | 12:13 PM Updated Updated Jun 03, 2024 | 12:13 PM

Portugal Air Show: ఆకాశంలో జరిగే ఎయిర్ షో చూడటానికి ఉంతో ఉత్సహాంగా జనాలు తరలి వస్తుంటారు. విమానాల విన్యాసాలు చూడటానికి ఎంతో ఆసక్తికరంగా.. ఉత్కంఠంగా ఉంటుంది.. వివిధ రకాల యాంగిల్స్ లో పైలెట్లు విన్యాసాలు చేస్తుంటారు.

Portugal Air Show: ఆకాశంలో జరిగే ఎయిర్ షో చూడటానికి ఉంతో ఉత్సహాంగా జనాలు తరలి వస్తుంటారు. విమానాల విన్యాసాలు చూడటానికి ఎంతో ఆసక్తికరంగా.. ఉత్కంఠంగా ఉంటుంది.. వివిధ రకాల యాంగిల్స్ లో పైలెట్లు విన్యాసాలు చేస్తుంటారు.

  • Published Jun 03, 2024 | 12:13 PMUpdated Jun 03, 2024 | 12:13 PM
వీడియో: ఎయిర్‌షో‌లో అపశృతి.. ఢీకొన్న రెండు విమానాలు..!

ఇటీవల విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలగిస్తున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది సమయానికే సాంకేతిక లోపం కారణంగా కొన్ని జరిగితే.. వాతావరణంలో మార్పులు, పక్షులు ఢీ కొట్టడం ఇతర కారణాల వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. సాంకేతిక లోపాన్ని ముందుగానే పసిగట్టి పైలెట్లు సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్నిసార్లు ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా విమానాలు ఢీ కొని పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎననో ఉన్నాయి. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్నది పూర్తి వివరాల్లోకి వెళితే..

పోర్చుగల్ లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాల్లో విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీ కొనడంతో ఓ పైలట్ మరణించగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోర్చుగల్ లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతుంది. మిలటరీ విమానాలు, హెలికాప్టర్లు ఒకే చోట చేరాయి. ఆకాశంలో పైలట్లు తమ సాహసాలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరు విమానాలు గాల్లోకి ప్రదర్శన ఇస్తున్నాయి.. అంతలోనే అనుకోకుండా ఓ విమానం మరో విమానానికి ఢీ కొట్టింది. దీంతో రెండు విమానాలు కుప్పకూలిపయాయి.

ఈ దుర్ఘటనలో స్పెయిన్ కు చెందిన పైలట్ అక్కడిక్కడే కన్నుమూశాడు. పోర్జుగల్ జాతీయువైన మరో పైలట్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ పైలెట్ ని బెజా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిచారు. కాగా, ప్రమాదానికి గురైన రెండు విమానాలు యాకోవెల్వ్ యాక్ – 2 అన.. అవి సోవియట్ డిజైన్డ్ ఎరోబెటీక్ ట్రైనింగ్ మోడల్ కి చెందినవని అన్నారు. ఈ ఘటనపై పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబోలో డిసౌజ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.