P Krishna
చాలా సినిమాల్లో తల్లి పొత్తిళ్లలో ఉండగానే కవల పిల్లలు విడిపోతుంటారు. పెద్దయ్యాక అనుకోని పరిస్థితుల్లో ఎదురై ఇద్దరూ ఒకే రూపంలో ఉండటం చూసి షాక్ తింటారు.
చాలా సినిమాల్లో తల్లి పొత్తిళ్లలో ఉండగానే కవల పిల్లలు విడిపోతుంటారు. పెద్దయ్యాక అనుకోని పరిస్థితుల్లో ఎదురై ఇద్దరూ ఒకే రూపంలో ఉండటం చూసి షాక్ తింటారు.
P Krishna
ఒకప్పుడు బాలీవుడ్ లో వచ్చి బ్లాక్ బస్టర్ చిత్రం సీతా ఔర్ గీతా.. రాముడు-భీముడు, హలో బ్రదర్ ఇలా ఎన్నో సినిమాల్లో పుట్టగానే ఆస్పత్రి బెడ్ పై నుంచి విడిపోయిన ఇద్దరు కవలలు చాలా ఏళ్ల తర్వాత అనుకోని సంఘటనల్లో ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. ఇద్దరి రూపాలు ఒకేలా ఉండటంతో.. తాము అన్నదమ్ములం అని గుర్తుపట్టే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అలాంటిది నిజ జీవితంలో జరిగితే ఇంకేలా ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి సంఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న తనంలో విడిపోయిన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, తల్లీ బిడ్డలు కలుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అచ్చం అలాంటి ఘటనే జార్జియాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
యూరోపియన్ దేశమైన జార్జియాలో ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ కవలలు పుట్టిన వెంటనే వేరయ్యారు. విచిత్రం ఏంటంటే ఒకిరికి తెలియకుండానే మరొకరు ఒకే ఊరిలో పెరిగారు. అమీకి ఎంతో ఇష్టమైన టీవీ షో ‘జార్జియాస్ గాట్ టాలెంట్’ ప్రోగ్రామ్ లో తన పోలికలతో ఉన్న అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది. అయితే చాలా ఏళ్ల క్రితం తనకు దూరమైన సోదరి అని తెలియదు. మరోవైపు అనో కి నీలి రంగు జుట్టుతో తనలాగే ఉంటు టిక్ టాక్ వీడియోలో హల్ చల్ చేస్తున్న అమీ వీడియో కంటపడింది. ఆమె గురించి విచారించగా తాము కవలలం అని నిర్దారించుకుంది. అలా ఒకరినొకరు తాము ఎవరిమో తెలుసుకొని ఎంతో ఎమోషన్ అయ్యారు.. అసలు తాము ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అన్న విషయం తెలుసుకొని షాక్ తిన్నారు.
అజా షోనీ అనే మహిళ ఈ కవల పిల్లలకు జన్మనిచ్చింది. 2002 లో అమీ ఖ్విటియా, అనో సార్టానియా లు పుట్టిన తర్వాత తల్లి కోమాలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో కవలల తండ్రి గోచా గఖారియా దుష్ట ఆలోచనలతో డబ్బు కోసం అదే ఊరిలో వేర్వేరు కుటుంబ సభ్యులకు పిల్లలను అమ్మాడు. అలా అమీ ఖ్విటియా, అనో సార్టానియా ఒకే ఊరిలో ఉన్నా.. 19 ఏళ్ళ వరకు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా పెరిగారు. విచిత్రం ఏంటంటే.. ఇద్దరి అభిరుచి ఒకేలా ఉంటుంది.. ఇద్దరికీ సంగీతం, డ్యాన్స్ అంటే పిచ్చి, ఒకే హెయిర్ స్టైల్, ఇద్దరిదీ ఒకే రకమైన గొంతు. అయితే అనోకి ఎవరినీ హత్తుకోవడం అంటే ఇష్టముండదు.. కానీ మొదటిసారి తన సోదరిని అమీని చూసి గట్టిగా హత్తుకుందట. 2005 వరకు జార్జియాలో పిల్లల అపహరణ కేసులు చాలా నమోదు అయ్యాయి. ఏది ఏమైనా అచ్చం సినిమా స్టైల్ లో ఈ కవలల గాథ ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.