iDreamPost
android-app
ios-app

ఘోర రైలు ప్రమాదం…బోల్తా కొట్టిన భోగీలు! 140 మంది..

Train Accident: తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు జనాలను భయపెడుతున్నాయి. రైళ్లు ఎక్కేందుకు కూడా సందేహిస్తున్నారు. ఇప్పటికే పలు రైలు ప్రమాదాలు జరగ్గా..తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ట్రైన్ లో 800 మంది ప్రయాణిస్తున్నారు.

Train Accident: తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు జనాలను భయపెడుతున్నాయి. రైళ్లు ఎక్కేందుకు కూడా సందేహిస్తున్నారు. ఇప్పటికే పలు రైలు ప్రమాదాలు జరగ్గా..తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ట్రైన్ లో 800 మంది ప్రయాణిస్తున్నారు.

ఘోర రైలు ప్రమాదం…బోల్తా కొట్టిన భోగీలు! 140 మంది..

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ట్రైన్లలో జర్నీ చేయాలంటే.. జనాలు భయపడిపోతున్నారు. సురక్షితంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస ట్రైన్ యాక్సిడెంట్స్ కారణంగా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. ఆ తరువాత కూడా పశ్చిమ్ బెంగాల్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుని దాదాపు 10 మంది మరణించారు.  ఇది ఇలా ఉంటే.. ఓ ప్రాంతంలో కూడా ఘోర రైలు ప్రమాదం జరిగింది. 140 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మరి.. ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రష్యా దేశంలోనే  ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ రష్యాలో 800 మంది ప్రయాణికులతో ఓ ట్రైన్ వెళ్తుంది. ఇది  లెవెల క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు రైలు భోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 140 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ట్రైన్ టాటర్‌స్థాన్‌లోని కజాన్ నుండి నల్ల సముద్రం మీదుగా అడ్లెర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మాస్కోకు దక్షిణంగా 1,200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కొటెల్నికోవో స్టేషన్ సమీపంలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో పట్టాలు తప్పిందని అక్కడి అధికారులు తెలిపారు. ఆ ట్రైన్ నడిపే లోకో ఫైలెట్ , ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి క్రాసింగ్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ  ప్రమాదం జరిగిందని రష్యన్ రైల్వే తెలిపింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారని, అయితే అధికారులు ఆ విషయాన్ని ధృవీకరించలేదనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పట్టాలు తప్పిన బోగీల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ అపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగినపుడు ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.. భయంతో అరిచారు. మరి.. ఇలాంటి రైలు ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.