విషాదం.. పడవ బోల్తా పడి 12 మంది జాలర్లు మృతి!

Pakistan Crime News: ఈ మధ్య కాలంలో భూమిపైనే కాదు.. సముద్ర మార్గం, ఆకాశ మార్గాల్లో కూడా ప్రమాదాల పెరిగిపోతున్నాయి. సముద్రంలో పడవ బోల్తా పడి 12 మంది జాలర్లు మృత్యువాత పడ్డారు.

Pakistan Crime News: ఈ మధ్య కాలంలో భూమిపైనే కాదు.. సముద్ర మార్గం, ఆకాశ మార్గాల్లో కూడా ప్రమాదాల పెరిగిపోతున్నాయి. సముద్రంలో పడవ బోల్తా పడి 12 మంది జాలర్లు మృత్యువాత పడ్డారు.

మృత్యువు ఏ రూపంలో ముంచుకు వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు మరుక్షణం కంటికి కనిపించకుండా పోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సాధారణంగా ప్రయాణ సమయాల్లో జరిగే ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది భూమి, సముద్రం, ఆకాశ మార్గం ఎక్కడైనా కావొచ్చు. రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. నిత్యం పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. ఇక విమాన, పడవ ప్రమాదాల్లో కూడా ఎంతోమంది చనిపోతున్నారు. తాజాగా సముద్రంలో బోటు బోల్తా పడి 12మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్నినింపింది. వివరాల్లోకి వెళితే..

అరేబియా సముద్రంలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. ఓ పడవ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న 12 మంది పాకిస్థాన్ జాలర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం పాక్ మిలటరీ అధికారులు వెల్లడించారు. తప్పిపోయిన  మత్స్యకారుల కోసం అన్వేషిస్తున్నారు. పాకిస్థాన్.. కారాచీలోని ఇబ్రహీం హైదరీ ప్రాంతానికి చెందిన 45 మంది మత్స్యకారులు ఈ నెల 5న అస్సాద్ అనే ఓడలో చేపట వేటకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న ఓడ బోల్తా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా.. భారత సరిహద్దుకు సమీపంలో హాజామ్రో క్రిక్ సమీపంలో సముద్రంలో పడవ బోల్తా పడిందని.. ఇందులో 45 మంది జాలర్లు ఉన్నారని పాక్ మిలటరీ గతంలో తెలిపింది.

ఈ క్రమంలో బుధవారం 12 మంది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా పాకిస్థాన్ లో రద్దీ ఎక్కువ ఉండటం వల్ల రవాణా సమయంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. సముద్రంలో ప్రయాణించే ఓడలు కూడా తరుచూ ప్రమాదాలకు గురి అవుతున్నాయని.. దీనికి ప్రధాన కారణం సామర్ధ్యానికి మించి పడవల్లో ప్రయాణించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

Show comments