Arjun Suravaram
సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు ఎక్కువయ్యాయి. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి..చివరకు పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఓ యువకుడు దారుణంగా మోసపోయాడు.
సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు ఎక్కువయ్యాయి. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి..చివరకు పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఓ యువకుడు దారుణంగా మోసపోయాడు.
Arjun Suravaram
ఇటీవల కాలంలో చాలా మంది తొలిచూపులోనే ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు ఎక్కువయ్యాయి. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి..చివరకు పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తున్నాం. అలాగే ఓ యువకుడు కూడా తోలి చూపులేనే ఓ యువతి ప్రేమలో పడిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకే వివాహం కూడా చేసుకున్నారు. కానీ పెళ్లైన 12 రోజుల తర్వాత ఆ వరుడికి ఉహించని షాక్ తగిలింది. దీంతో తలపట్టుకున్నాడు. ఈ సంఘటన ఇటీవల ఇండోనేషియా జరిగింది.
ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయం అయ్యింది. చాలా రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఏ రేంజ్ లో చాటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతిని చూడగానే ఆ వ్యక్తి ప్రేమలో పడ్డాడట. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాని ప్రపోజ్ చేశాడు. ఇక ఆ వ్యక్తి తనకు కాబోయే భార్య గురించి ఏమీ ఆలోచించకుండానే ప్రేమలో మునిగిపోయాడు. అందుకే ఆ ప్రేమ మైకంలో ఆ నెట్ సుందరి మోసాన్ని గుర్తించలేకపోయాడు.
ఇక ఆ నెట్ లో పరిచయమైన సుందరి తన పేరు అదిండా కంజ అజ్జహ్రా అనే పేరుతో పరిచయం చేసుకుంది. ఆమె తన ప్రియుడికి కలిసినప్పుడల్లా హిజాబ్ ధరించే వచ్చేది. ఇక తనకు కాబోయే భార్య ఉండే తీరు ఆ వ్యక్తిని ఎంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఆమె శైలిని చాలా ఇష్టపడ్డాడు. పెళ్లి మందు వరకు హిజాబ్ ధరించింది అంటే.. అతడికి సంతోషంగానే ఉంది. కానీ పెళ్లై తర్వాత కూడా ఆమె ముఖం దాచుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు ఆ నెట్ సుందరి.. ఆ వ్యక్తి బంధువులు ముందు తడబడుతూ ఉండేది.
కొత్తగా పెళ్లైనా కూడా భార్య ప్రవర్తన చూసిన ఆ వ్యక్తి కలత చెందాడు. ఆ తర్వాత అతనికి అనుమానం మొదలైంది. తన భార్య ఏదో దాస్తుందని సదరు వ్యక్తి భావించాడు. ఈ క్రమంలో తన భార్యపై ఫోకస్ పెట్టి విచారించగా అసలు నిజం తెలిసి షాకయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు భార్యగా భావించిన వ్యక్తి నిజానికి అమ్మాయి కాదు ఓ అబ్బాయి. అమ్మాయిలాగా నటించి ఈ వ్యక్తిని దారుణంగా మోసం చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నెట్ సుందరి పై కేసు నమోదు చేశారు. మోసం కేసులో అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని స్థానికులు చెబపుతున్నారు.