వీడియో: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైర్.. కారు ధ్వంసం

Tire Falls Off United Plane: విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే.. చక్రం ఊడిపోయి కింద పడింది. అప్రమత్తమైన పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది...ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Tire Falls Off United Plane: విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే.. చక్రం ఊడిపోయి కింద పడింది. అప్రమత్తమైన పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది...ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు, ఇంజన్ లో మంటలు రావడం, ప్రకృతి అనుకూలించకపోవడం, పక్షులు ఢీ కొట్టడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలకు గురైతున్నాయి. ఆ సమయానికి పైలైట్లు ప్రమాదాన్ని గుర్తించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదాలు తప్పిపోతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే టైర్ ఊడిపోవడం తీవ్ర కలకల రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ బోయింగ్ విమానం 777-200 శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జపాన్ లోని ఒసాకాకు బయల్దేరింది. గురువారం ఉదయం ఈ విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే గాల్లో ఉండగానే విమానం వెనుక వైపున ల్యాండింగ్ గేర్ లోని ఒక టైర్ ఊడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్ లాట్ లో ఉన్న ఒక కారుపై పడింది. పైనుంచి అతి వేగంగా కారుపై పడటంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే టైర్ ఊడిపోయిన విషయాన్ని పైలెట్ గమనించి విమానాన్ని వెంటనే దారి మళ్లించాడు.

లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ప్రయాణికులను వేరే విమానంలో తమ గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి పైలెట్ చాకచక్యంగా విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండిగ్ చేయడం.. ప్రయాణికులు క్షేమంగా బతికి బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది వరకు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోవడంతో ప్రయాణికులు విమాణ ప్రయాణాలంటే భయపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments