పేడతో పండ్లు తోముకోవడం, గోమూత్రంతో తలస్నానం.. ఎక్కడంటే!

పేడతో పండ్లు తోముకోవడం, గోమూత్రంతో తలస్నానం.. ఎక్కడంటే!

భాతీయులకు గోవులు అంటే ఎంతో ప్రీతి.. ముఖ్యంగా హిందువులు ఆవులను గోమాతగా పూజిస్తారన్న విషయం తెలిసిందే. అయితే.. భారతదేశంలో కాకుండా ఆఫ్రికాలో కూడా ఆవులను కుటుంబ సభ్యులల చూసుకునే ఒక ప్రత్యేకమైన తెగ ఉందన్న సంగతి తెలుసా..

భాతీయులకు గోవులు అంటే ఎంతో ప్రీతి.. ముఖ్యంగా హిందువులు ఆవులను గోమాతగా పూజిస్తారన్న విషయం తెలిసిందే. అయితే.. భారతదేశంలో కాకుండా ఆఫ్రికాలో కూడా ఆవులను కుటుంబ సభ్యులల చూసుకునే ఒక ప్రత్యేకమైన తెగ ఉందన్న సంగతి తెలుసా..

ప్రాచీన భారతీయ సంస్కృతిలో పశువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు పరిస్థితుల్లో, కాలం మారిపోయింది కాబట్టి పశువులను మనం అక్కడక్కడా చూస్తున్నాము. కానీ, ఒకప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ఇళ్లలో పశువులు ఉండేవి.. పశుసంపదతోనే కొంతమందికి జీవనాధారం కూడా లభించేది. ముఖ్యంగా హిందువులకు గోవులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. గోమూత్రం, పేడ, ఆవు పాలు ఇలా ఆవు నుంచి వచ్చే ప్రతి దానిని కూడా.. ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇతర దేశాల్లో ఎక్కడా కూడా ఇలాంటి సంస్కృతీ సంప్రదాయాలు కనిపించవనే చెప్పి తీరాలి. అయితే, ఒక్క ఆఫ్రికాలో మాత్రం అచ్చం ఇలానే.. ఆవులను తమ కుటుంబ సభ్యులల భావించి.. వారి జీవితం, జీవనాధారం అన్ని ఆవులుగా భావించే.. ఓ ప్రత్యేకమైన తెగ ఉందట. వారి గురించి తెలుసుకుందాం.

ఆవులు సొంత మనుషుల్లా చూసుకునే ఆ తెగ వారు.. ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్‌లో నివసిస్తున్నారు. వీరంతా కూడా ముండారీ తెగకు చెందినవారు. అక్కడ వారు ఆవులను పశువుల చూడకుండా కంటికి రెప్పలా చూస్తూ.. అది వారి గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఆవులే వారి సిరిసంపదలు, ఆస్తులు , జీవనాధారంగా భావిస్తూ ఉంటారు. పైగా ఆవులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తూ.. వాటిని మెషిన్ గన్‌తో కాపలా కాస్తూ ఉంటారు. వాటికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు.. ముండారి జాతి ప్రజలు.. సర్వం దారపోస్తారు. అంతే కాకుండా వారి జీవితంలో అత్యంత విలువైనవి పశువులు అని వారు భావిస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలానే.. చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే వారు పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ప్రేమిస్తున్నారని చెప్పి తీరాలి.

పైగా, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, వాటికి సరిపడా ఆహారం అందించాలని వారు నిత్యం కష్టపడుతూనే ఉంటారు. అయితే, అక్కడ ఉండే ఆవులు కూడా.. ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. వాటి ధరలు కూడా అధికంగానే పలుకుతాయి. ఈ ఆవుల కనీస ధర 500 డాలర్లు అంటే దాదాపు 42 వేల రూపాయలు వరకు ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే.. వారు వారి వారి పిల్లల పెండ్లిలో పశువులను కట్నంగా ఇస్తుంటారు. ఇంకా వారు గోమూత్రంతో తలస్నానం చేస్తారు. గోమూత్రంలోని యూరిక్ యాసిడ్ తల వెంట్రుకలకు మంచి రంగునిస్తుందని వారి నమ్మకం. ఆవు మూత్రం మాత్రమే కాకుండా పేడ కూడా వాడతారు.. పేడతో పళ్ళు తోముకుంటారు. అంతేకాకుండా.. దోమలను తరిమికొట్టేందుకు పేడ, గోమూత్రాన్ని యాంటీబయాటిక్స్‌ రూపంలో వాడతారు. ఇక్కడి ప్రజలు పశువులతో కలిసే పడుకుంటారు. పశువులు తోడు లేకుంటే చావుతో సమానమని వారు నమ్ముతారు. ఇంతలా పశువులను ప్రేమించే జాతి కేవలం ఇదొక్కటే అయ్యిటుంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments