4 వేల ఏళ్ల నాటి రాయి రహస్యం.. ఆ మ్యాప్‌ నిధిదా?

దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఓ నిర్థారణకు వచ్చారు. ఆ పురాతన రాయిపై ఉన్న మ్యాప్‌.. ఓ నిధికి సంబంధించిందని అంటున్నారు. అది పూర్తి స్థాయిలో ధ్రువీకరణ కావటానికి మరికొన్నేళ్ల పరిశోధనలు

దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఓ నిర్థారణకు వచ్చారు. ఆ పురాతన రాయిపై ఉన్న మ్యాప్‌.. ఓ నిధికి సంబంధించిందని అంటున్నారు. అది పూర్తి స్థాయిలో ధ్రువీకరణ కావటానికి మరికొన్నేళ్ల పరిశోధనలు

ఈ సృష్టి ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు నెలవు. శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. సైన్స్‌కు కూడా అంతుచిక్కని రహస్యాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో రాయిపై మ్యాప్‌ రహస్యం కూడా ఒకటి. కొన్ని వేల ఏళ్లకు చెందిన ఆ రాయిపై ఓ మ్యాపు ఉంది. ఆ మ్యాప్‌ ఎంటన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ మ్యాప్‌ దేనికి సంబంధించింది అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. యూరప్‌ ఖండంలోని ఫ్రాన్స్‌లో 1900లలో ఓ రాయి దొరికింది. దానిపై ఓ మ్యాప్‌ గుర్తించబడింది. దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా.. అది కాంస్య యుగపు రాతి వస్తువుగా తేలింది. దానికి సెయింట్‌ బెలెక్‌ స్లాబ్‌గా పేరుపెట్టారు. 2001లో దాన్ని ఐరోపాలోని పురాతన మ్యాప్‌గా ప్రకటించారు. ఎన్ని పరిశోధనలు జరిగినా దానిపై ఉన్న మ్యాప్‌ ఏంటన్నది శాస్త్రవేత్తలకు తెలియరాలేదు. అది 2014లో మిస్‌ అయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ సెల్లార్‌లో దొరికింది.

దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఓ నిర్థారణకు వచ్చారు. ఆ పురాతన రాయిపై ఉన్న మ్యాప్‌.. ఓ నిధికి సంబంధించిందని అంటున్నారు. అది పూర్తి స్థాయిలో ధ్రువీకరణ కావటానికి మరికొన్నేళ్ల పరిశోధనలు అవసరం అవుతాయని చెబుతున్నారు. ఆ రాయి మీద ఉన్న ఫజిల్‌ లాంటి మ్యాప్‌ను సరిగ్గా పరిస్కరిస్తే.. భారీ నిధి చిక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కనుమరుగైన చరిత్ర గురించి కూడా తెలుస్తుందని పేర్కొంటున్నారు. మరి, శాస్త్రవేత్తలకే చుక్కలు చూపిస్తున్న ఆ అంతుచిక్కని రాయి మ్యాప్‌ రహస్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments