iDreamPost
android-app
ios-app

Naga Chaitanya: శోభితతో వెకేషన్‌లో నాగ చైతన్య.. యూరప్‌ టూర్‌ ఫోటోలు వైరల్‌

  • Published Jun 05, 2024 | 8:44 AM Updated Updated Jun 05, 2024 | 8:44 AM

నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ వారిద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ వారిద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

  • Published Jun 05, 2024 | 8:44 AMUpdated Jun 05, 2024 | 8:44 AM
Naga Chaitanya: శోభితతో వెకేషన్‌లో నాగ చైతన్య.. యూరప్‌ టూర్‌ ఫోటోలు వైరల్‌

సామాన్యంగానే మన సమాజంలో ఆడామగా కాస్త చనువుగా ఉంటే.. వారి మధ్య ఏదో ఉందని పుకార్లు షికారు చేస్తాయి. ఇక సినిమా సెలబ్రిటీల గురించి అయితే ఇవి చాలా ఎక్కువ. ఫ్రెండ్‌షిప్‌ కొద్ది కాస్త కలిసి తిరిగినా.. బయటకు వెళ్లినా.. ఇక వారి మధ్య ఏదో ఉందంటూ జోరుగా ప్రచారం సాగిస్తారు. రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం చేస్తారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోరు. తమ పని ఏదో తాము చూసుకుంటారు. ఇక టాలీవుడ్‌ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ గురించి ఇలాంటి వార్తలు ఈమధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి కనిపిస్తుండటంతో.. వీటికి బలం చేకూరినట్లు అవుతోంది. ఇక తాజాగా ఈ ఇద్దరు మరోసారి కలిసి కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అక్కినేని హీరో.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే గత కొన్నాళ్లుగా చైతూ టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నారంటూ ఫిల్మ్ నగర్లో ఒకటే ప్రచారం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫొటోలు అనేక సార్లు నెట్టింట వైరలయ్యాయి. ఇక వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ జోరుగా పుకార్లు ప్రచారం అవుతున్నా.. వీరు మాత్రం దీనిపై స్పందించడం లేదు. దాంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు మరోసారి చైతూ, శోభిత పేర్లు వార్తల్లో నిలిచాయి. ఈ ఇద్దరికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

చైతు, శోభిత ఇద్దరు కలిసి వెకేషన్‌కు వెళ్లారు. యూరప్‌ టూర్‌లో ఉన్నారు. ఇక వీరిద్దరూ అక్కడ ఉన్న ఓ బార్‌లో వైన్ టెస్టింగ్ సెషన్‌లో పాల్గొన్నట్లుగా ఉన్న ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో చైతూ ఇప్పుడు తండేల్ సినిమా కోసం ఉన్న లుక్ లోనే కనిపించడంతో ఇద్దరు కలిసే వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైతూ, శోభితా చాలా రోజులుగా కలిసే వెకేషన్ వెళ్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. చైతూ అభిమానులు మాత్రం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఎలా ఉన్నా మరోసారి వీరిద్దరూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక శోభిత విషయానికి వస్తే తెలుగు, హిందీతోపాటు హాలీవుడ్‌లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం సితార అనే సినిమాలో నటిస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss