Krishna Kowshik
మాల్దీవులు అధ్యక్షుడిగా మయిజ్జు అధికారం చేపట్టిన నాటి నుండి భారత్ పై ఏదో ఒక రకంగా విషం చిమ్ముతూనే ఉన్నాడు. మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు శరణు కోరిన మాల్దీవులను భారత్ సాయం చేసింది.
మాల్దీవులు అధ్యక్షుడిగా మయిజ్జు అధికారం చేపట్టిన నాటి నుండి భారత్ పై ఏదో ఒక రకంగా విషం చిమ్ముతూనే ఉన్నాడు. మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు శరణు కోరిన మాల్దీవులను భారత్ సాయం చేసింది.
Krishna Kowshik
ఇండియా అవుట్ నినాదంతో అధికారాన్ని చేపట్టాడు మహ్మద్ మయిజ్జు. మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇండియాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్న సంగతి విదితమే. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. లక్షద్వీప్ పర్యటన అనంతరం అక్కడ టూరిజంను డెవలప్ చేసే విధంగా ట్వీట్ చేశారు. ఇదే అదునుగా భావించిన మాల్దీవుల నేతలు.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం.. అది పెను దుమారానికి దారి తీసిన సంగతి విదితమే. ఇప్పుడు మాల్దీవులలోని భారత దళాల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 76 భారత మిలిటరీ సిబ్బంది వెనక్కు వచ్చినట్లు సమాచారం. ఇంతటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో కూడా సాయం చేసింది భారత్.
ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్న ఈ సమయంలో కూడా మాల్దీవులకు భారీ సాయాన్ని అందించింది ఇండియా. ఇటీవల భారత్‌లో పర్యటించిన మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయిన సంగతి విదితమే. ఈ సందర్భంగా తమకు ఆర్ధిక సహకారం అందజేయాలని కోరారు. దీంతో రూ.417.45 కోట్ల రుణాన్ని అందించింది. దీంతో వడ్డీ లేకుండా ఈ రుణాన్ని మాల్దీవులు వినియోగించుకునే వెసులుబాటు కలిగించింది. ఇప్పుడు ఆ రుణాన్ని వాడుకునేందుకు ఏడాది గడువును పొడిగించింది. మాల్దీవులు చేసిన విన్నపం మేరకు ఈ సాయాన్ని అందించింది భారత్. ఈ సాయంపై స్పందించిన మూసా జమీర్.. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశానికి 50 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ.417.45 కోట్లు) కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
మాలేలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుణాన్ని వాడుకోడానికి ఏడాది గడువును పొడిగించందని మాల్దీవుల విదేశాంగ కార్యాలయం తెలిపింది. ‘బడ్జెట్ కేటాయింపుల మద్దతు రూపంలో మాల్దీవులకు భారత ప్రభుత్వం అందిస్తున్న ఉదారమైన సాయాన్ని ఎంతో అభినందిస్తున్నాం. భారత్ సహాయంతో పెద్ద సంఖ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో గ్రాంట్ సహాయంగా చెప్పుకోదగిన భాగం ఉంది. తమ ప్రజల పరస్పర ప్రయోజనం, శ్రేయస్సు కోసం భాగస్వామ్య సహకారం కొనసాగించడానికి మాల్దీవుల ప్రభుత్వం ఎదురుచూస్తోంది’ అని ముయిజ్జు ప్రభుత్వం ప్రకటన చేసింది.