iDreamPost
android-app
ios-app

ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌!

  • Published Jun 11, 2024 | 4:03 PM Updated Updated Jun 11, 2024 | 6:04 PM

ఈ మధ్య కాలంలో తరుచూ విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి.. సామన్య పౌరులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైతం కన్నుమూస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తరుచూ విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి.. సామన్య పౌరులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైతం కన్నుమూస్తున్నారు.

ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు మరీ ఎక్కువ అయ్యాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపాలు.. అకస్మాత్తుగా వాతావరణంలోని మార్పులు.. ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పైలెట్లు ప్రమాదాన్ని ముందుగానే గమనించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయడం ద్వారా ప్రమాదాలు తప్పుతున్నాయి. గత నెల ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన పోగమంచు, ఈదరు గాలుల వల్ల పర్వతాల మధ్య కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ దేశ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాప్ట్ గల్లంతు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంతకీ ఏ దేశ ఉపాధ్యక్షులు.. అసలు ఏం జరిగిందో అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

గత నెల ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం మరువక ముందే.. మరో విమానం మిస్సింగ్ కేసు కలవరపెడుతుంది. మలావీ ఉపాధ్యక్షులు సావులోస్ చిలిమా తో పాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిగాంగ్వే నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా.. అక్కడికి చేరుకోలేదు. విమానం రాడార్ నుంచి మాయమైందని.. దీంతో విమానయాన అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

ఇదిలా ఉంటే దేశ అధ్యక్షులు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటన రద్దు చేసుకొని విమానం సెర్చ్ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం అధ్యక్షలు ఇతర దేశాల సహాయం కోరుతున్నట్లు సమాచారం. మాలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింజిరి కూడా ఆ విమానంలో ఉన్నట్లు సమాచారం. ఈ సైనిక విమానం జూజూ నగరంలోని ఓ కెబినెట్ మాజీ మంత్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అసవరం లేదని.. ఎట్టి పరిస్థితిలో విమానం కనుగొంటామని దేశ అధ్యక్షులు లాజరస్ చక్వేరా తెలిపారు. ఇదిలా ఉంటే.. విమాన ప్రమాదంలో మాలవి ఉపాధ్యక్షులు సావులోస్ చిలిమాతోొ పాటు మరో 9 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం లేకపోవడం వల్ల పర్వత శ్రేణుల్లో విమానం కూలిపోయి వీరంతా దుర్మరణం చెందినట్లు వార్తలు వస్తున్నాయి.