iDreamPost
android-app
ios-app

ఏడాది క్రితం మిస్సైన మోడల్.. చివరకు ఆ పరిస్థితుల్లో ఉందంటూ ఫోన్

బ్రతుకుదెరువు కోసం పొరుగు దేశానికి వెళ్లింది మోడల్. అక్కడ కూడా అవకాశాలు రాలేదు. అయినా కుటుంబ పోషణ కోసం అక్కడే ఉండిపోయింది. సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసేది. ఏడాది క్రితం మిస్సైంది.

బ్రతుకుదెరువు కోసం పొరుగు దేశానికి వెళ్లింది మోడల్. అక్కడ కూడా అవకాశాలు రాలేదు. అయినా కుటుంబ పోషణ కోసం అక్కడే ఉండిపోయింది. సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసేది. ఏడాది క్రితం మిస్సైంది.

ఏడాది క్రితం మిస్సైన మోడల్.. చివరకు ఆ పరిస్థితుల్లో ఉందంటూ ఫోన్

ఆమె మోడల్‌గా రాణించాలనుకుంది. తన దేశంలో అవకాశాలు నిండుకోవడంతో పరాయి దేశానికి పరుగెత్తింది. మోడలింగ్ రంగంలో అవకాశాలు రాలేదు. కానీ బతుకు దెరువు కోసం ఏదో ఒక పని చేయక తప్పదని భావించి.. ఓ రెస్టారెంట్‌లో పనికి కుదిరింది. అక్కడకు వెళ్లింది అనే మాటే గానీ.. తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా ఫోటోలు పోస్టు చేస్తూ ఉండేది. అంతలో ఓ బాయ్ ఫ్రెండ్ తోడు కూడా దొరికింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. అంత సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో.. సోషల్ మీడియాలో ఆమె కొత్త పోస్టులు కనిపించట్లేదు. అలాగే ఫోనులో సంప్రదించినా ఉపయోగం లేదు.

చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరాయి దేశ రాయబార కార్యాలయ సాయాన్ని కోరారు. కానీ ఎవరూ గుర్తించలేకపోయారు. ఏడాది తర్వాత.. తల్లిదండ్రులకు ఓ ఫోన్ వెళ్లింది. గుర్తు తెలియని ఓ మృతదేహం మార్చురీలో ఉందని, ఆమెకు సంబంధించిన కొన్ని గుర్తులు చెప్పగానే.. పరుగు పరుగున వెళ్లి చూసేసరికి మోడల్ కైకన్ కెన్నకం అని తేలింది. ఆ కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేదు. కనిపించడం లేదు అనుకుంటే..ఎక్కడో ఓ చోట బతికి ఉందని అనుకున్నారు కానీ.. ఇలా చూసే సరికి కన్నీటి పర్యంతం అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..థాయ్ లాండ్‌కు చెందిన మోడల్ కైకన్ కెన్నకం.. తన దేశంలో అవకాశాలు కరువై.. 3 ఏళ్ల క్రతం బహ్రెయిన్‌కు వెళ్లింది. అక్కడ మోడల్‌గా అవకాశాలు రాలేదు కానీ.. కుటుంబాన్ని పోషించేందుకు రెస్టారెంట్‌లో ఉద్యోగం పొందింది.

తల్లిదండ్రులు ఆవేదన చెందడంతో తాను బాగున్నానని చెబుతూ.. సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఉండేది. అంతలో ఒకరిని ప్రేమిస్తున్నానని, అతడితో కొత్త జీవితం ప్రారంభించినట్లు చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ నుండి కొత్త అప్డేట్స్ రావడం లేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళ చెంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహ్రెయిన్‌లోని థాయ్‌ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నెల 18న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని సల్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు థాయ్ ఎంబసీ దృష్టికి వచ్చింది. తన కాలు మీద టాటూ ఉన్నట్లు చెప్పడంతో.. కైకన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. టాటూ ఆధారంగా గుర్తించారు. అతిగా మద్యం సేవించడం వల్ల గుండె ఆగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు దౌత్యపరమైన సహాయాన్నికోరారు ఆమె కుటుంబ సభ్యులు.