iDreamPost
android-app
ios-app

పెళ్లి కాలేదు కానీ.. 100 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు!

  • Published Jul 31, 2024 | 2:37 PM Updated Updated Jul 31, 2024 | 2:37 PM

Telegram CEO: పెళ్లైన రెండు మూడేళ్లకు సంతానం కలగకుంటే ఆ దంపతులపై రక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. సమాజంలో తలెత్తే ఇబ్బందులతో వైద్యులను సంప్రదిస్తుంటారు. ప్రస్తుతం సంతాన ప్రాప్తి కోసం వైద్యశాస్త్రంలో ఎన్నో పద్దతులు వచ్చాయి.

Telegram CEO: పెళ్లైన రెండు మూడేళ్లకు సంతానం కలగకుంటే ఆ దంపతులపై రక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. సమాజంలో తలెత్తే ఇబ్బందులతో వైద్యులను సంప్రదిస్తుంటారు. ప్రస్తుతం సంతాన ప్రాప్తి కోసం వైద్యశాస్త్రంలో ఎన్నో పద్దతులు వచ్చాయి.

పెళ్లి కాలేదు కానీ.. 100 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు!

ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి కాకుండా సింగిల్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.  పెళ్లి తర్వా త కుటుంబ భారం, రక రకాల టెన్షన్లు ఇవన్నీ తట్టుకోవడం కష్టమని భావిస్తున్న యువత డేటింగ్ కల్చర్ కి అలవాటు పడ్డారు. నచ్చిన వారితో డేటింగ్ చేయడం తర్వాత గుడ్ బై చెప్పడం. మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా సింగిల్ గా ఉండటానికే మక్కువ చూపిస్తున్నారు. మరికొంత మంది పెళ్లి కాకున్నా తమకు పిల్లలు ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం మహిళలు సరోగసి సిస్టమ్ ద్వారా పిల్లల్ని కని పెంచుకుంటున్నారు. ఓ వ్యక్తి పెళ్లి కాకుండానే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 మందికిపైగా పిల్లలకు తండ్రి అయ్యాడు. 12 దేశాల్లలో ఆయన ద్వారా పిల్లలు కలిగినట్లు చెబుతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఎలా వందమంది పిల్లలకు తండ్రి అయ్యాడు? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

టెలీగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ (39) కి సంబంధంచిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. కానీ తనకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని ఆ పోస్ట్ సారాంశం. ప్రపంచంలోని 12 దేశాల్లో తనకు పిల్లలు ఉన్నారని పావెల్ తెలిపారు. ఈ వార్త అందరినీ షాక్ కి గురిచేసింది. పెళ్లి కాకుండానే వంద మంది పిల్లకు ఎలా తండ్రి అయ్యాడా? అన్న ఆలోచనలో పడ్డారు. పెళ్లి కాకుండా అంతమంది పిల్లకు తండ్రి ఎలా అయ్యాడో క్లారిటీ ఇచ్చారు పావెల్. 40 ఏళ్ల వయసుకు దగ్గర ఉన్న పావెల్ దురోవ్ ఇంకా వివాహం చేసుకోలేదు. కానీ తన వీర్యం ద్వారా ఇప్పటి వరకు 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అయ్యాడు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉందని పావెల్ చెబుతున్నాడు.

15 ఏళ్ల క్రితం తాను 24 ఏళ్ల వయసులో ఉన్నపుడు తన స్నేహితుడు చెప్పిన మాట ప్రకారం వీర్య దానం చేయడం వల్ల పిల్లలు పుట్టరని డిసైడ్ అయిన ఓ కపుల్ కి సంతానం కలగడం చాలా సంతోషం అనిపించింది. మొదట తన ఫ్రెండ్ చెప్పిన మాట విని ఆశ్చర్యపోయిన నవ్వుకున్నానని వెల్లడించారు. తనకు తర్వాత తెలిసింది సంతాన లేమి అనేది ఎంతో పెద్ద సమస్య.. ఎంతోమంది తల్లిదండ్రులు మనోవ్యథకు గురవుతున్నారని అర్థమైంది. తన వల్ల ఇతరులు సంతోషిస్తారన్న విషయం తెలిసి వీర్యదానం చేయడం మొదలు పెట్టానని పావెల్ తెలిపారు. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.తనకు పెళ్లి కాలేదు.. వీర్యదానం చేయడం సామాజిక బాధ్యతగా భావించి ఈ పని చేస్తున్నానని చెప్పారు. తాను స్పెర్మ్ డొనేషన్ లో రిజిస్టర్ చేసుకున్నానని.. ఇప్పటి వరకు 12 దేశాల్లో 100 మందికి పైగా దంపతులకు తన వీర్యంతో పిల్లలు కలిగేలా చేసినట్లు తెలిపారు.