Keerthi
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు అనేవి ప్రజలను బెంబేలితిస్తున్నాయి. కాగా,ఈ మధ్యనే మూడు వారాల కిందట తైవాన్ లో భారీ భూకుంపం దేశం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి గంటల వ్యవధిలో వరుస భూకంపలు విరుచుకుపడటంతో ప్రజలు ప్రాణలను అరచేతిలో పెట్టుకొని బిక్కుడిక్కుమంటూ గడిపారు
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు అనేవి ప్రజలను బెంబేలితిస్తున్నాయి. కాగా,ఈ మధ్యనే మూడు వారాల కిందట తైవాన్ లో భారీ భూకుంపం దేశం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి గంటల వ్యవధిలో వరుస భూకంపలు విరుచుకుపడటంతో ప్రజలు ప్రాణలను అరచేతిలో పెట్టుకొని బిక్కుడిక్కుమంటూ గడిపారు
Keerthi
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు అనేవి ప్రజలను బెంబేలితిస్తున్నాయి. అయితే ఈ భూకంపాలతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇప్పటికే భారత్, నేపాల్, జపాన్, చైనా , అప్ఘానిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. కాగా,ఈ మధ్యనే మూడు వారాల కిందట తైవాన్ లో భారీ భూకుంపం దేశం మొత్తాన్ని కుదిపేసింది. దాదాపు రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో హువాలియన్ కౌంటీలో సంభవించిన ఈ భూకంపంలో.. 14 మంది ప్రాణాలు బలితీసుకుంది. అంతేకాకుండా.. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఇక అప్పటి నుంచి తరుచు భూప్రకంపలు ఆ ప్రాంతంలో కొనసాగుతునే ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి భూకంపం సంభవించడంతో అక్కడ ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఈ మధ్య తైవాన్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలకు వరుస భూకంపాలతో కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇలా ఎప్పటికప్పుడు సంభవిస్తున్న భూకంపాల వలన భారీగానే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్ లోని సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు పలు ప్రాంతాల్లో.. పదుల సంఖ్యల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, వీటిలో ఒకటి అత్యధికంగా రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతగా నమోదయ్యింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక ఈ భూకంపాం అనేది స్వల్ప నష్టం జరిగిందని, పైగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే అత్యధిక జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతం హువాలియన్‌లో ఏప్రిల్ 3వ తేదీన 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో 14 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా, అప్పటి నుంచి దాదాపు 20 రోజుల వ్యవధిలో అక్కడ సూమారు 1,000 సార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి.
ఇక రాజధాని తైపీతో సహా తైవాన్ తూర్పు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో.. సోమవారం రాత్రంతా భూప్రకంపనలు కొనసాగాయని, వీటిలో అత్యధికంగా 6.3 తీవ్రతతో వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ భూకంపాలు సుమారు 180 వరకూ ఉంటాయని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ సందర్భంగా సిస్మోలాజికల్ సెంటర్ డైరెక్టర్ వు చియెన్-ఫు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకంపనలు భూమిలోపల కేంద్రీకృత శక్తి విడుదలని, బహుశా అంత బలమైనవి కాకపోయినా ఇంకా ఎక్కువ సంభవించవచ్చని అన్నారు. అయితే మరోవైపు తైవాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హువాలియన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాగా, ఏప్రిల్ 3వ తేదీన సంభవించిన భూకంపం కారణంగా దెబ్బతిన్న రెండు భవనాలు.. ప్రస్తుత భూప్రకంపనలతో కూలిపోయినట్టు అగ్నిమాపక విభాగం అధికారులు తెలిపారు.
అయితే ఈ భూప్రకంపనలతో పర్వత ప్రాంతమైన హువాలియన్ కౌంటీలో బండరాళ్లు కూలడంతో కొన్ని రహదారులను మూసివేశారు. అలాగే, ప్రభుత్వం కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక, తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండటంతో.. అక్కడ తరుచూ భూకంపాలకు ఏర్పడుుతన్నాయి. కాగా, 2016లో కూడా దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా చనిపోయారు. అంతేకాకుండా.. దీనికి ముందు 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల 2,000మందికి పైగా మరణించారు. మరి, తైవాన్ లో గంటల వ్యవధిలో 180 సార్లు భూంకపం సంభవించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.