nagidream
80K For Those Who Quits Country: ఇదెక్కడి విడ్డూరం.. ప్రభుత్వమే పౌరులని దేశం వదిలి వెళ్లిపొమ్మని అంటుంది. పైగా దేశం విడిచిపెట్టి పోయేవారికి డబ్బులు కూడా ఇస్తామని ఆఫర్ చేస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? డబ్బులు ఇచ్చి మరీ వెళ్లగొట్టాలనుకోవడానికి కారణం ఏంటి?
80K For Those Who Quits Country: ఇదెక్కడి విడ్డూరం.. ప్రభుత్వమే పౌరులని దేశం వదిలి వెళ్లిపొమ్మని అంటుంది. పైగా దేశం విడిచిపెట్టి పోయేవారికి డబ్బులు కూడా ఇస్తామని ఆఫర్ చేస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? డబ్బులు ఇచ్చి మరీ వెళ్లగొట్టాలనుకోవడానికి కారణం ఏంటి?
nagidream
ప్రభుత్వమే దగ్గరుండి మరీ ఆ దేశ పౌరులను ఇతర దేశాలకు పంపించేయాలని చూస్తుంది. ప్రయాణ ఖర్చులు ఇస్తాం, ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ 80 వేలు ఇస్తాం పిల్లలకి 40 వేలు ఇస్తాం.. దేశం వదిలేసి వెళ్లిపోండి అంటూ ఆ దేశ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలో జనాభాను తగ్గించేందుకు స్వీడన్ ప్రభుత్వం కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. వలసదారులు అడ్డుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తుంది. ఇదే విధానాన్ని విదేశాల నుంచి వచ్చి స్వీడన్ దేశంలో స్థిరపడిన వారిపై కూడా అమలు చేస్తుంది. వేరే దేశాల్లో పుట్టి స్వీడన్ లో నివాసం ఉంటున్న పౌరులకు అక్కడి ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. ఇతర దేశాల్లో పుట్టి చదువు, ఉద్యోగాల కోసమని స్వీడన్ వచ్చి అక్కడ ఎవరైతే స్థిరపడ్డారో వారిని అక్కడ నుంచి పంపించేయాలని కంకణం కట్టుకుంది.
అందుకోసం డబ్బులు ఇస్తామని.. ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామని తెలిపింది. ఈ మేరకు స్వీడన్ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గర్డ్ కీలక ప్రకటన చేశారు. స్వీడన్ లో స్థిరపడిన వలసదారులు తమకు తాముగా దేశాన్ని విడిచి స్వదేశానికి వెళ్లిపోవాలని.. అలా వెళ్లేవారికి 10 వేల స్వీడన్ క్రౌన్స్ ఇస్తామని అన్నారు. ఒక్కొక్కరికీ 10 వేల స్వీడన్ క్రౌన్స్ ఇస్తామని.. పిల్లలు ఉంటే అందులో సగం 5 వేల స్వీడన్ క్రౌన్స్ ఇస్తామని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అమౌంట్ ఇస్తామని.. ఒకేసారి చెల్లిస్తామని అన్నారు. 10 వేల స్వీడన్ క్రౌన్స్ అంటే మన కరెన్సీ ప్రకారం 80 వేల రూపాయలు. 5 వేల స్వీడన్ క్రౌన్స్ అంటే 40 వేలు. అంతేకాదు మీ దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.
ఇప్పటివరకూ వలసదారులకే ఈ కొత్త రూల్స్ ని వర్తింపజేసేది. వీళ్ళకి అక్కడ శాశ్వత సభ్యత్వం ఉండదు కాబట్టి వీళ్లని వెళ్లిపొమ్మని చెప్పేది. అయితే ఇప్పుడు శాశ్వత సభ్యత్వం ఉన్న వలసదారులను కూడా వెళ్లిపొమ్మని చెబుతుంది. అందుకోసం ఇలా ఆర్థిక సహాయం, ప్రయాణ ఖర్చులు పెట్టుకుంటామని వెల్లడించింది. అయితే స్వీడన్ ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం.. ఆ దేశ జనాభా పెరగడమే. ప్రపంచంలో అనేక దేశాల నుంచి స్వీడన్ కి భారీగా వలసదారులు వస్తుండడంతో 20 ఏళ్లలో దేశ జనాభా భారీగా పెరిగిపోయింది. ఒక రిపోర్టు ప్రకారం 20 లక్షలకు పైగా వలసదారులు స్వీడన్ లో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం స్వీడన్ జనాభా ఒక కోటి 6 లక్షలు పైనే ఉన్నారు. ఇందులో 20 లక్షల మంది వేరే దేశాలకు చెందిన వారు ఉన్నారు. జనాభా ఎక్కువైపోతుందన్న కారణంతో 2015లో వలసలపై ఆంక్షలు తీసుకొచ్చింది. అయినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో జనాభాని నియంత్రించాలన్న ఉద్దేశంతో కొత్త ఆఫర్ ని ప్రకటించింది.