చిక్కుల్లో సునీతా విలియమ్స్.. అసలేం జరిగిందంటే?

Sunita Williams: భారత సంతతికి చెందిన మహిళ వ్యోమగామి సునితా విలియమ్స్ ఈ నెల 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని డ్యాన్స్ చేస్తూ తెలిపిన విషయం తెలిసిందే.

Sunita Williams: భారత సంతతికి చెందిన మహిళ వ్యోమగామి సునితా విలియమ్స్ ఈ నెల 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని డ్యాన్స్ చేస్తూ తెలిపిన విషయం తెలిసిందే.

సునితా విలియమ్స్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సునిత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందినవారు.. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. ఈ దంపతులు సంతనమే సునితా విలియమ్స్. అమెరికాలో పుట్టి పెరిగిన ఈమె తండ్రి ప్రోత్సాహంతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్‌గా చేరింది. అప్పటి నుంచి తన పనితనంలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఈ క్రమంలోనే ఆమెను వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. 1998 లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ సునితా విలియమ్స్. తాజాగా అంతరిక్షంలో సునితా విలియమ్స్ చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునితా విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్ గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’అనే బాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెరిగిపోతుందని.. ఇది బహుళ ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియాను మల్టీ – డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని ‘సూపర్ బగ్ ’ గా పిలుస్తారని.. దీని ప్రభావం శ్వాసకోశ వ్యవస్థపై పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సూపర్ బగ్ తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునితా విలియమ్స్ సహా మిగిలిని ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తుంది.సునితా విలియమ్స్ తో పాటు బారీ యూజిన్ వ్యోమగామి జూన్ 6, 2024 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునిత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్త పరిచింది.

హ్యాపీగా ఉన్న సమయంలో అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్ ఉందన్న వార్త తెలియడంతో ఆందోళన మొదలైంది. ఈ స్పేస్ బగ్స్ గ్రహాంతరాలకు సంబంధించినవి కావని.. వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. వారు విభిన్నమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మ జీవుల ప్రభావాన్ని అంచనా వేసే పరిశోధనలు జరుగుతున్నాయని.. అవి నాసా ‘జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ’ కి చెందిన డాక్టర్ కస్తూరి వేంకటేశ్వరన్ సారధ్యంలో జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2023 లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా ‘కలామిల్లా పియార్సోని’ అనే కొత్త మల్టీ – డ్రగ్ రెసిస్టెంట్ బగ్ ని డాక్టర్ కస్తూరి వేంకటేశ్వరన్ కనుగొన్నారు.

Show comments