2025 వరకు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్! నాసా చెప్పిన షాకింగ్ నిజాలు!

Sunita Williams: మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ టెక్నికల్ కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. 2025 వరకు సునీత అంతరిక్షంలోనే ఉండాల్సి రావచ్చు.

Sunita Williams: మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ టెక్నికల్ కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. 2025 వరకు సునీత అంతరిక్షంలోనే ఉండాల్సి రావచ్చు.

భారత సంతతి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పేస్ లోనికి వెళ్లిన అతి తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పటికే రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె సురక్షితంగా తిరిగి వచ్చింది. అయితే ఇటీవలే మూడోసారి రోదసిలోకి సునీత విలియమ్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో రోజుల తరబడి అక్కడే ఉండిపోయింది. 2025 వరకు ఆమె అంతరిక్షంలోనే ఉండాల్సి రావచ్చు. ఈ న్యూస్ కు తాజాగా అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా తెలిపిన విషయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ టెక్నికల్ కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీత, విల్ మోర్  ఇద్దరూ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ అనే మానవర సహిత రాకెట్లో స్పేస్ సెంటర్ కి వెళ్లారు. వాస్తవానికి ఎనిమిది రోజుల మిషన్ ను పూర్తి చేసుకుని జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. ఇలా వారు తిరుగు ప్రయాణమైన సమయంలో వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ఇష్యూ ఎదురయ్యాయి. రోజులు గడుస్తున్న ఆ సాంకేతిక సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే జూన్ 6  అంటే గత రెండు నెలలుగా సునీత విలియమ్స్, విల్ మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రాకపై బుధవారం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఓ అప్ డేట్ ఇచ్చింది. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ తిరిగి భూమి మీద ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలా సురక్షితంగా లేకపోతే.. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు పలు ఆప్షన్లు ఉన్నాయని తెలిపింది. అలా ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025 ఫిబ్రవరిలో ఉందని నాసా పేర్కొంది. అది కూడా స్పేక్స్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ వ్యోమనౌకతో వారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని నాసా పేర్కొంది. ఇక నాసా చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే సునీత, విల్‌మోర్‌ మరో ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండే ఛాన్సులు కన్పిస్తున్నాయి.

వారిద్దరిని తీసుకొచ్చేందుకు నాసా అన్ని ప్లాన్లను సిద్ధం చేస్తోంది. స్పేక్స్‌ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను పంపించే అవకాశాలు ఉన్నాయి. 2024 సెప్టెంబరులో ఈ ప్రయోగం ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ ఇద్దరు ఆస్ట్రనాట్స్ భూమి మీదకు తీసుకురావాలని నాసా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్టార్‌ లైనర్‌లోనే వారిని తీసుకురావాలా? లేదా క్రూ డ్రాగన్‌ను ఉపయోగించాలా? అన్నదానిపై వచ్చే వారం నాసా నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెల్లడించాయి.

Show comments