iDreamPost
android-app
ios-app

శాస్త్రవేత్తల సంచలన ప్రకటన.. విశ్వంలో మరో భూమిలాంటి గ్రహం!

  • Published Jul 11, 2024 | 2:03 PM Updated Updated Jul 11, 2024 | 2:03 PM

Another Earth Like Planet: ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి.. వీటిలో మానవులు నివసించేందుకు అనుకూలంగా ఉన్న గ్రహం భూమి. ఇటీవల శాస్త్రవేత్తలు విశ్వంలో ఇతర గ్రహాలపై ఎన్నో పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Another Earth Like Planet: ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి.. వీటిలో మానవులు నివసించేందుకు అనుకూలంగా ఉన్న గ్రహం భూమి. ఇటీవల శాస్త్రవేత్తలు విశ్వంలో ఇతర గ్రహాలపై ఎన్నో పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే.

శాస్త్రవేత్తల సంచలన ప్రకటన.. విశ్వంలో మరో భూమిలాంటి గ్రహం!

అనంత విశ్వంలో కాటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోక చుక్కలు ఉన్నాయి. విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్న గ్రహం భూమి ఒక్కటే. భూమిపైనే కాకుండా ఇతర గ్రహాల్లో జీవరాశి ఉందా? లేదా? అన్న పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు భూమిని పోలిన మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అత్యంత దగ్గరగా తీసిన ఫోటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ గ్రహంపై భూమిపై ఉన్నట్లు సముద్రాలు ఉన్నాయనేది శాస్త్రవేత్తల నమ్మకం. ఈ ఫోటోలు చూస్తే బ్లూ కలర్ లో అలాగే కనిపిస్తున్నాయి. ఇది భూమి కన్నా పెద్దది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే.

శాస్త్రవేత్తల అధ్యాయనంలో ఓ అద్భుతం బయటపడ్డట్లు చెబుతున్నారు. భూమిని పోలి ఉన్న మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అత్యంత దగ్గరగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భూమిపై ఉన్నట్లు సముద్రాలు ఉన్నాయనేది ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. మొదట ఓ చిన్న గ్రహంగా భావించినప్పటికీ.. పరిశోధనల తర్వాత ఆ గ్రహంపై రాళ్లు, నీళ్లు, సముద్రాలు ఉండే అవకాశం ఉన్నట్లు బలమైన విశ్వాసాన్ని వెలుబుచ్చారు. అయితే ఈ గ్రహం భూమికన్నా పెద్దదిగా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ కొత్త గ్రహం గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పలు సంచనల విషయాలు తెలిపారు. ఈ గ్రహాన్ని LHS 1140b Cetus గా పిలుస్తారు. ఈ గ్రహం సుమారు 48 కాంతి సంవత్సరాల ూదరంలో ఉన్నట్లు అంచనా.. ఈ గ్రహం ప్రవర్తన కారణంగా జీవం మనుగడ సాగించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తల నమ్మకం. ఈ గ్రహం చుట్టూ ఉన్న నక్షత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాలకు వచ్చారు. మొదట్లో ఈ గ్రహాన్ని హైడ్రోజన్ – రిచ్ వాతావరణంతో మినీ – నెఫ్ట్యూన్ గా భావించినప్పటికీ.. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వీక్షించిన తర్వాత పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కొత్త డేటాలో భూమి కంంటే పెద్ద గ్రహం అని.. రాళ్లు, నీరు, మంచు, నీరు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.