iDreamPost
android-app
ios-app

రోబో సినిమా రిపీట్.. మనిషిని చంపిన రోబో!

  • Published Nov 09, 2023 | 1:58 PM Updated Updated Nov 09, 2023 | 1:58 PM

సాధారణంగా రోబోలు మనకు ఎంత సౌకర్యాన్ని ఇస్తుంటాయో.. కొన్నిసార్లు అంతే అసౌకర్యాన్ని కలుగజేస్తుంటాయి. అందుకే యంత్రాలపై ఆధారపడటం మానవాళికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా రోబోలు మనకు ఎంత సౌకర్యాన్ని ఇస్తుంటాయో.. కొన్నిసార్లు అంతే అసౌకర్యాన్ని కలుగజేస్తుంటాయి. అందుకే యంత్రాలపై ఆధారపడటం మానవాళికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

రోబో సినిమా రిపీట్.. మనిషిని చంపిన రోబో!

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో మనిషి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. నిత్యం ఎదో ఒక కొత్త పరికరాలు సృష్టిస్తూ.. మనుషుల పనులను, జీవవనశైలిని సులభతరం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యాంత్రీకరణ పెరిగిపోతుంది. రాను రాను రొబోటిక్ మెషన్ల వాడకం మరింత పెరిగిపోతుంది. అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్ లో ప్రమాదకరంగా మారుతుందని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగం వల్ల రాబోయే రోజుల్లో మానవ మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోబోలు, ఏఐ తో మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్న వాదనలు తరుచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ రోబో మనిషి ప్రాణాలు తీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాల్లో ఒకటి రోబో. ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2010 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో రాబోయే రోజుల్లో రోబోటిక్ మెషిన్లు ఎలాంటి ప్రమాదాలు సృష్టిస్తాయన్న విషయం గురించి తెలియాజేశారు. మానవాళికి ఉపయోగపడాల్సిన రోబో.. అక్రమార్కుల చేతిలో పడితే ఎంతటి వినాశనం జరుగుతుందో డైరెక్టర్ కళ్లకు కట్టినట్టు చూపించారు. అప్పట్లో ఈ మూవీ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పుడప్పుడు కొన్నిసార్లు కంప్యూటర్లు, రోబోలు సమయానికి పనిచేయకపోవడం వల్ల తీవ్ర నష్టం కలుగుతుంటాయి. తాజాగా రోబో మూవీలో జరిగిన సంఘటనే ఒకటి రియల్ లైఫ్ లో జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా రోబో హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ దురదృష్టకరమైన ఘటన దక్షిణ కొరియాలో ఓ ప్రైవేట్ కంపెనీలో చోటు చేసుకుంది.

దక్షిణ కోరియాలో ఓ ఇండస్ట్రీలో ఓ రోబోని చెకింగ్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని చంపేసింది. దక్షిణ జియోంగ్ సాంగ్ ప్రావిన్స్ లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే కేంద్రంలో ఒక రోబో పనిచేస్తుంది. రోబోటిక్స్ కంపెనీకి చెందిన 40 ఏళ్ల ఉద్యోగి ఆ రోబో సెన్సార్ కి సంబంధించిన కార్యాకలాపాలను చెక్ చేయడానికి వెళ్లాడు. ఆ రోబో పెప్పర్ తో నింపిన పార్శిల్ పెట్టెలను ఎత్తి ప్యాలెట్ పై పెట్టే పని చేస్తుంది. తనిఖీలో భాగంగా ఇండస్ట్రీయల్ రోబోటిక్ వ్యక్తిని పెట్టెగా భావించి అతడిని నలిపేసినట్లుగా యోన్‌హాప్ పోలీసులు వెల్లడించారు. రోబోటిక్ చేయి వ్యక్తిపై భాగాన్ని కన్వేయర్ బెల్టుపై ఉంచి ముఖాన్ని, చాతిని తీవ్రంగా నలిపివేసింది. అది గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని పక్కకు లాగారరు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు యోన్‌హాప్ పోలీసులు. ఇలాంటి సెన్సార్ సిస్టమ్స్ ఉన్న రోబోలను తనిఖీ చేయడానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలతని నిపుణులు సూచిస్తున్నారు.