iDreamPost
android-app
ios-app

విషాదం.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం

  • Published Jan 29, 2024 | 6:16 PM Updated Updated Jan 29, 2024 | 6:16 PM

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఫేమస్ కావడానికి రక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.. అలా ఓ వ్యక్తి సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఫేమస్ కావడానికి రక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.. అలా ఓ వ్యక్తి సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

విషాదం.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు  మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇటీవల చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సాంగ్స్, డ్యాన్స్.. ఎవరూ చేయని సాహసాలు చేస్తున్నారు. అదృష్టం బాగుండి రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లు  అయిన వారు చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు వారుచేసే సాహసాలు ఫెయిల్ అయి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఓ బ్రిటీష్ స్కైడైవర్ ఎవరూ చేయలేని ఓ సాహసం చేసి అందరి దృష్టిని ఆకర్శించడానికి పూనుకున్నాడు.. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. వివరాల్లోకి వెళితే..

కేంబ్రిడ్జి షైర్ లోని హంన్టింగ్టన్‌కు చెందిన నేథన్ ఓడిస్సన్.. వయసు 33 సంవత్సరాలు. కొంతకాలంగా స్కైడైవర్ గా ఎన్నో సాహసాలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అతనికి స్కైడైవర్ లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. నేథన్ ఓడిస్సన్ గత కొంత కాలంగా తాను చేసిన సాహసకృత్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. అంతేకాదు స్కైడైవింగ్ చేసేవారికి సలహాలూ.. సూచనలు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే నేథన్ ఓడిస్సన్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేని సాహసం చేసి అందరి దృష్టి ఆకర్షించి మరింత ఫేమస్ కావాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే 29 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచాడు.

అపార్ట్ మెంట్ భద్రతా సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నాడు నేథన్ ఓడిస్సన్ ఎవరికీ తెలియకుండా అపార్ట్‌మెంట్ లోని 29వ అంతస్తుకు చేరుకున్నాడు.  భవనం బయట  ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ నేథన్ సాహసం రికార్డు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నేథన్ కిందకు దూకుతూ.. పారాచూట్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. దురదృష్టం కొద్ది ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అతి వేగంగా కిందకు దూసుకు వచ్చిన నేథన్ సమీపంలోని చెట్లలోనుంచి పడుతూ బలంగా భూమికి తాకడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదలిలాడు. పారాచూట్ ఫైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం గురించి బాంకాక్ లోని బ్రిటన్ ఎంబసికి సమాచారం అందించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేండి.