Arjun Suravaram
Singapore Airlines Flight: రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు రైసీ కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో సహా మొత్తం ఎనిమిది మంది ఈ ఘటనలో మృతి చెందారు. తాజాగా సింగపూర్ విమానం కూడా ప్రమాదానికి గురైంది.
Singapore Airlines Flight: రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు రైసీ కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో సహా మొత్తం ఎనిమిది మంది ఈ ఘటనలో మృతి చెందారు. తాజాగా సింగపూర్ విమానం కూడా ప్రమాదానికి గురైంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో విమాన ప్రమాద ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో చోటుచేసుకుంటున్నాయి. కేవలం ఫ్లైట్ మాత్రమే కాకుండా.. హెలికాఫ్టర్లు సైతం ప్రమాదానికి గురవుతున్నాయి. సాంకేతి సమస్యలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వంటి ఇతర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నేపాల్ దేశంలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగి..72 మంది సజీవదహనం అయ్యారు. రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు రైసీ కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో సహా మొత్తం ఎనిమిది మంది ఈ ఘటనలో మృతి చెందారు. తాజాగా సింగపూర్ కి చెందిన విమానం కూడా ప్రమాదానికి గురైంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
సింగపూర్ కి చెందిన ఎయిర్ లైన్ విమానంలో ప్రమాదం జరిగింది. లండన్ నుంచి సింగపూర్ కి వెళ్తుండగా గాల్లో ఉన్న విమానం భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయలైనట్లు తెలుస్తోంది. దీంతో విమానాన్ని బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సింగపూర్ కు చెందిన బోయింగ్ 777-300ఈఆర్ విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ కి బయల్దేరింది. ఈ క్రమంలోనే మార్గం మధ్యలో గాల్లో ఉన్న విమానం అకస్మాత్తుగా కుదుపులకు లోనైందని సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక ఈ ఘటనలో ఒక ప్రయాణీకుడు మృతి చెందగా, 30 మందికి గాయలైనట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలానే మృతుడి కుటుంబానికి సదరు ఎయిర్ లైన్స్ సంతాపం తెలిపింది. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనలో ఆ విమానాన్ని వెంటనే బ్యాంకాక్ లో ల్యాండింగ్ చేశారు. అప్పటికే సమాచారం అందుకున్న థాయ్ లాండ్ అధికారులు ఎయిర్ పోర్టులో అంబులెన్సలను సిద్ధంగా ఉంచారు. ఇక విమానం ల్యాండ్ అవగానే..గాయపడిన వారిని అంబులెన్స్ తో తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
గత ఆదివారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్ అనేది అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో.. తూర్పు అజర్‌బైజాన్‌లో కూలిపోయింది. ఇక ఈ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. చివరకు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో రైసీతో సహా ఎనిమిది మంది చనిపోయారు. తాజాగా సింగపూర్ విమాన ఘటన కూడా అందరిని భయాందోళకు గురి చేసింది. ఇంకేమైన జరిగి ఉంటే 200 ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని పలువురు అభిప్రాయా పడుతున్నారు.