iDreamPost
android-app
ios-app

Sea Turtle: తాబేలు మాంసం తిని 9 మంది మృతి, 78 మందికి సీరియస్!

ప్రస్తుతం కాలంలో మాసం తినే వారి సంఖ్యగా బాగా పెరిగి పోయింది. దాదాపు అనేక రకాల జీవులను మాంసాహారంగా మనిషి తీసుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆహారం విషంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటుంది. తాజాగా తాబేళు మాంసం తిని 9 మంది మృతి చెందారు.

ప్రస్తుతం కాలంలో మాసం తినే వారి సంఖ్యగా బాగా పెరిగి పోయింది. దాదాపు అనేక రకాల జీవులను మాంసాహారంగా మనిషి తీసుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆహారం విషంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటుంది. తాజాగా తాబేళు మాంసం తిని 9 మంది మృతి చెందారు.

Sea Turtle: తాబేలు మాంసం తిని 9 మంది మృతి, 78 మందికి సీరియస్!

మనిషి ఆహారంగా అనేక రకాల జీవులను తింటుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో  కొన్ని రకాల జీవులను తినడంతో విషాదాలు చోటుచేసుకుంటాయి. అందుకు అనేక రకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఫ్యాక్టరీలు తమ కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థాలను చుట్టుపక్కల ఉన్న చెరువులు, సముద్రాలలో కలుపుతుంటారు. ఇలాంటి సందర్భాలలో సముద్రంల్లో ఉండే చేపలు, తాబేలు వంటి జీవులు ఆ వ్యర్థాలు ఆహారంగా తీసుకుంటాయి. ఎన్నో జలచర జీవులు చనిపోయి కుప్పలుగా సముద్ర తీరానికి వస్తుండటం మనం చూస్తుంటాం. అలాంటి వాటిని తిని కూడా పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ ఘరో విషాదం చోటుచేసుకుంది.

తాబేలు మాంసం తిని ఏకంగా 9 మంది మృతి చెందారు. అలానే 78 మంది ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈ విషాద ఘటన తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో చోటు చేసుకుంది. తూర్పు ఆఫ్రికా  ప్రాంతంలోని టాంజానియా దేశంలోని ప్రజలు సముద్ర తాబేళ్ల ఆహారంగా తీసుకుంటారు. ఇక్కడ లభించే సముద్ర తాబేళ్ల  డిమాండ్ ఎక్కువాగ ఉంటుందంట. ముఖ్యంగా జాంజిబార్ సముద్ర దీవుల్లో దొరికే తాబేళ్లు రుచికరంగా ఉంటాయని టాక్. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తాబేళ్ల మాంసం తింటుంటారు.

అనేక రకాల ఫ్లెవర్లలో రుచికరమైన తాబేళ్ల మాంసం ను ఇక్కడ వండి అమ్ముతుంటారు. అలానే తాజాగా ఆ ప్రాంతంలో సముద్ర తాబేళ్లు మాంసాన్ని కొందరు తిన్నారు. ఆ మాంసం తిన్న కాసేపటి వారంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాబేళ్లు మాసం తిన్న వారిలో 9 మరణించగా, మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కి పడింది.  తాబేళ్లలో కిలోనిటాక్సియం అనేపదార్థం ఉంటుందని, దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని, అది తిన్నవారు చనిపోయి ఉండోచ్చని స్థానిక వైద్యులు చెబుతున్నారు.

కొన్ని రకాల తాబేళ్లలో కిలోనిటాక్సిజం అనే కెమికల్ ఉంటుందని, ఇది ఫుడ్ పాయిజనింగ్ కి దారి తీసి..మరణాలకు కారణమవుతుందని, అలాంటి వాటిని అస్సలు తినొద్దని స్థానిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తాబేళ్లు మాంసం కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమగ్ర విచారణకు దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తోంది. మరి..ఇలా మాంసం కారణంగా జరిగే విషాదాలను నివారించేందుకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.