iDreamPost
android-app
ios-app

Video: కుప్పకూలిన విమానం.. 15 మంది మృతి!

  • Published Mar 13, 2024 | 1:00 PM Updated Updated Mar 13, 2024 | 1:03 PM

ఇటీవలే నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి మరువక ముందే తాజాగా మరో మిలిటరి రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఎక్కడంటే..

ఇటీవలే నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి మరువక ముందే తాజాగా మరో మిలిటరి రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఎక్కడంటే..

  • Published Mar 13, 2024 | 1:00 PMUpdated Mar 13, 2024 | 1:03 PM
Video: కుప్పకూలిన విమానం.. 15 మంది మృతి!

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన విమాన ప్రమాదాలనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రమాదాలనేవి సాంకేతి కారణాల వల్లనో, రన్ వేలపై ల్యాండింగ్, ఇతర కారణాల వల్ల తెలియదు కానీ, ఎన్నో ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఈ విమాన ప్రమాదాల్లో గాయపడిన వారి కంటే మరణించిన వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే నేపాల్ లో పోఖారాలో ప్రయాణీకుల విమానం కూలిపోయి 72 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఆ విమానం ఓ మిలిటరీ రవాణా కావాడం విశేషం. అయితే ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో అంతమంది ప్రాణాలు గాల్లోనే సజీవదహనమైనట్లు తెలుస్తోంది. ఇంతకి అదేక్కడంటే..

అసలే ఒక పక్క ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్నసమయంలో.. తాజాగా రష్యాలోని ఇవనోవో ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, అది మిలిటరీ రవాణా విమానం కావడం విశేషం. ఇక ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ఘటనలో విమానంలోని 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అలాగే ఇల్-76 మిలిటరీ కార్గో విమానం మంగళవారం పశ్చిమ రష్యాలోని ఎయిర్‌ బేస్‌ నుంచి 15 మందితో టేకాఫ్ అయ్యిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ లో మంటలు చెలరేగడం వల్ల ఇవానోవో ప్రాతంలో కూలినట్టు తెలిపింది. కాగా, ఈ ప్రమాద సమయంలో అందులో 8 మంది సిబ్బందితో పాటు.. ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్టు పేర్కొంది. విమానంలో ఉన్న వారి పరిస్థితి గురించి అధికారులు చెప్పనప్పటికీ.. వారెవరూ సురక్షితంగా లేరని రష్యా మీడియా పేర్కొంది. అయితే ప్రమాద ఘటన జరిగిన సమయంలో విమానంలోని పెద్ద ఎత్తునే మంటలు చెలరేగి ఓ వైపుకు ఒరిగి కిందకు పడిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, రష్యాలో సైనిక విమాన కుప్ప కూలిపోయిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.