iDreamPost
android-app
ios-app

అంబానీదే అనుకుంటే అంతకంటే రిచ్‌గా పెళ్లి వేడుక.. గెస్టులకు బహుమతిగా 66 వేలు

  • Published Jun 30, 2024 | 3:33 PM Updated Updated Jun 30, 2024 | 3:33 PM

Richer Than Ambani: ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేస్తున్నారు. అయితే ఇదే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుక అని అనుకున్నాం. కానీ ఇంతకంటే మోస్ట్ లగ్జరీ పెళ్లి వేడుక ఒకటి జరిగింది. వచ్చిన అతిథులకే ఒక్కొక్కరికీ రూ. 66 వేలు బహుమతి ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పెళ్ళికి ఏ రేంజ్ లో ఖర్చు పెట్టి ఉంటారో అనేది.

Richer Than Ambani: ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేస్తున్నారు. అయితే ఇదే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుక అని అనుకున్నాం. కానీ ఇంతకంటే మోస్ట్ లగ్జరీ పెళ్లి వేడుక ఒకటి జరిగింది. వచ్చిన అతిథులకే ఒక్కొక్కరికీ రూ. 66 వేలు బహుమతి ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పెళ్ళికి ఏ రేంజ్ లో ఖర్చు పెట్టి ఉంటారో అనేది.

అంబానీదే అనుకుంటే అంతకంటే రిచ్‌గా పెళ్లి వేడుక.. గెస్టులకు బహుమతిగా 66 వేలు

మరికొన్ని రోజుల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జరగబోతుంది. కాగా ఈ వేడుకను ముఖేష్ అంబానీ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ పెళ్లి కోసం కోట్లు వందల ఖర్చు చేశారు. దాదాపు 1200 కోట్ల నుంచి 1500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనంత్ అంబానీ పెళ్లి వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారు, వెండితో తయారు చేసిన పెళ్లి పత్రిక కూడా బాగా వైరల్ అయ్యింది. దీంతో ఇదే మోస్ట్ లగ్జరీ వెడ్డింగ్ అని అనుకుంటున్నారు. అంబానీని మించిన వాళ్ళు లేరు.. ఈ వేడుకను మించింది లేదు అని అనుకుంటున్నారు. కానీ అంబానీని మించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అంబానీ ఇంట పెళ్లిని మించిన వివాహ వేడుక మరొక చోట జరిగింది. 

చైనాకు చెందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ డానా చాంగ్.. షేర్ చేసిన వెడ్డింగ్ వీడియో ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మోస్ట్ లగ్జరీ వెడ్డింగ్ కి సంబంధించిన వీడియో అది. ఆ వీడియోలో పెళ్లి జరిగిన విధానం.. అతిథులను రిసీవ్ చేసుకున్న పద్ధతి, వారికీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ వంటివి షాక్ కి గురి చేస్తాయి. ఈ వేడుక ఐదు రోజుల పాటు సాగింది. పెళ్ళికి వచ్చిన అతిథులను విమానాల్లో తీసుకొచ్చారు. పెళ్లి అయ్యాక మళ్ళీ విమానాల్లోనే సాగనంపారు. అత్యంత విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్స్ లో వచ్చిన గెస్టులకు రూమ్స్ బుక్ చేశారు. మరి అతిథులు హోటల్స్ నుంచి పెళ్లి మండపానికి రావాలి కదా.. అందుకోసం రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లలో తీసుకొచ్చారు.

ఇక పెళ్లి మండపం సెటప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ డెకరేషన్, హడావుడి అంతా ఒక స్వర్గాన్ని తలపించేలా ఉంది. పెళ్లికి వచ్చిన అతిథులకు భారీగానే బహుమతులు కూడా ఇచ్చారు. ఒక్కో గెస్టుకి ఎరుపు రంగు కవర్ లో 800 డాలర్లు పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మన కరెన్సీ ప్రకారం 66 వేల రూపాయలు. దీంతో ఈ వేడుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతిథులకే 66 వేల రూపాయల చొప్పున రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటే.. ఆయన ఇంకెంత రిచ్ అయి ఉంటాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతిథులకు చేసిన మర్యాదలు.. వారి ప్రయాణ ఖర్చులు పెళ్లి వారే పెట్టుకోవడం బాగుందని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dana Wang | Solo & Adventure Travel (@bydanawang)