iDreamPost
android-app
ios-app

చిలీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత!

  • Published Sep 07, 2023 | 10:20 AMUpdated Sep 07, 2023 | 10:20 AM
  • Published Sep 07, 2023 | 10:20 AMUpdated Sep 07, 2023 | 10:20 AM
చిలీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై  6.2 తీవ్రత!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వరుస భూకంపాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప ప్రళయం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. వందల కోట్ల ఆస్తి నష్టమే కాదు.. 50 వేల మంది మృత్యువాత పడ్డారు. భూకంపాలు ఎక్కువగా భారత్, చిలీ, ఇండోనేషియా, అఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, జపాన్ వంటి దేశాల్లో ఎక్కువగా వస్తున్నాయి. చీలీలో భారీ భూకంప ప్రజలు మళ్లీ ఉలిక్కి పడ్డారు. ఉత్తర చిలీని మరోసారి భూకంపం వణికించింది. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా చిలీని భారీ భూకంపాలు వణికిస్తున్నాయి. రాత్రి 10.48 గంటలకు ఉత్తర చీలిలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.2 గా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం కాక్వింబోకు దాదాపు 41 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో 41 కిలోమీటర్ల లోతులో దీని కదలికలు సంభవించినట్లు తెలిపారు. చిలీని రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తారన్న విషయం తెలిసిందే. పసిఫిక్ తీరంలో ఉన్న ఈ దశంలో ఎక్కువగా అగ్ని పర్వతాలకు నెలవుగా ఉంది. ఈ కారణంతోనే ఇక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయని అధికారులు అంటున్నారు. భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు అని అధికారులు తెలిపారు. 2010 లో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం వల్ల కోట్లు నష్టం వాటిల్లడమే కాదు.. 600 మంది వరకు మరణించారు. ఈ భూకంప ధాటికి భారీ సునామీ కూడా వచ్చింది. ఇందువల్లనే ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో వరుస భూకంపాల వల్ల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.. భూకంప పేరు వింటేనే వెన్నుల్లో వణుకు పుట్టినంత పని అవుతుందని వాపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి