iDreamPost
android-app
ios-app

ధనవంతులు కార్లలో ప్రయాణించి క్యాన్సర్ బారిన పడుతున్నారు : అమెరికా సంస్థ

  • Published May 08, 2024 | 7:02 PM Updated Updated May 09, 2024 | 11:59 AM

ఒకప్పుడు కారు కొనడం అంటే చాలా విలాసవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు చాలా మంది కార్స్ కొంటున్నారు. కానీ.. కార్స్ లో ప్రయాణించిన కారణంగా ఎంతో మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారట.

ఒకప్పుడు కారు కొనడం అంటే చాలా విలాసవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు చాలా మంది కార్స్ కొంటున్నారు. కానీ.. కార్స్ లో ప్రయాణించిన కారణంగా ఎంతో మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారట.

  • Published May 08, 2024 | 7:02 PMUpdated May 09, 2024 | 11:59 AM
ధనవంతులు కార్లలో ప్రయాణించి క్యాన్సర్ బారిన పడుతున్నారు : అమెరికా సంస్థ

ఒకప్పుడు కేవలం ధనవంతులు మాత్రమే.. కార్స్ ను ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు చాల మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్స్ ను కొనుగోలు చేస్తున్నారు. రాను రాను కార్ ఓ నిత్యావసర వస్తువుగా మారిన కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక చాలా మంది ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణించాలన్న కూడా కార్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే,సాధారణంగా కార్ ఎక్కిన వెంటనే.. అదో రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇక సమ్మర్ సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఆ వాసన పడక తల తిరగడమో.. వాంతులు అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. అయితే వాటిని లైట్ తీసుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఆ వాసనల వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని.. తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

కారులో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసనలు కాన్సర్ కు దారితీస్తాయని.. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన.. నేషనల్‌ టాక్సాలజీ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన రీసెర్చ్ లో.. బయటపడింది. ఈ రీసెర్చ్ ను చేయడం కోసం.. 2015 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై పరిశోధనలు జరిపారు. ఈ రీసెర్చ్ కొన్ని ఆశర్యకర విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే 99% కార్స్ లో ప్రమాదకరమైన రసాయనాలు వెలువడినట్లు గుర్తించారు. వాటి నుంచి అగ్ని ప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ అనే కెమికల్స్ , క్యాన్సర్ వ్యాధికి కారణం అయ్యే టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు కూడా.. కారులో నుంచి విడుదల అవుతున్నాయని కనుగొన్నారు.

కార్స్ లో అనేక కారణాల వలన వ్యాపించే మంటలను అదుపు చేసే.. కెమికల్స్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అమెరికా హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన కేస్ స్టడీలో పరిశోధకులు తెలిపారు. అయితే మామూలుగానే ఓ కార్ డ్రైవర్ రోజుకు ఓ గంటసేపు కారులో ప్రయాణం చేస్తే.. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. డ్యూక్ యూనివర్సిటీకి చెందిన లీడ్ రీసెర్చర్ అండ్ టాక్సికాలజీ సైంటిస్ట్ రెబెకా హోయిన్ వెల్లడించారు. ఇక వేసవి కాలంలో ఈ కెమికల్స్ అధిక మోతాదులో విడుదల అవుతాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే కార్స్ లో విడుదలయ్యే క్యాన్సర్ కారక రసాయాలను తగ్గించేందుకు.. గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ కొన్ని విషయాలను సూచించారు. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలను తెరచి ఉండడం.. ఎండలో కాకుండా కార్లను నీడలో, గ్యారేజీల్లో పార్క్ చేసి ఉంచడం ద్వారా.. ఈ సమస్యలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.