Arjun Suravaram
సాధారణంగా ఎవరికైనా కోట్ల విలువ చేసే వజ్రం దొరికితే వారి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. అలానే ఓ ఇద్దరు యువకులకి కోట్ల విలువ చేసే డైమాండ్ దొరికింది. ఇక వారి సంతోషానికి అవధులు లేవు. అయితే వజ్రం దొరికిన తరువాత వారి జీవితంలో విచిత్రం చోటుచేసుకుంది.
సాధారణంగా ఎవరికైనా కోట్ల విలువ చేసే వజ్రం దొరికితే వారి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. అలానే ఓ ఇద్దరు యువకులకి కోట్ల విలువ చేసే డైమాండ్ దొరికింది. ఇక వారి సంతోషానికి అవధులు లేవు. అయితే వజ్రం దొరికిన తరువాత వారి జీవితంలో విచిత్రం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ప్రతి మనిషి జీవితంలో అదృష్టం అనేది తలపు తడుతుందని చాలా మంది అంటుంటారు. అలానే ఓ ఇద్దరు యువకుల విషయంలో అదే జరిగింది. కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది. ఇక వారి జీవితాలు మారిపోతాయని సంబరబడ్డారు. విదేశాలకు వెళ్లి..బాగా చదువుకుని ఉన్నత స్థితిలో స్ధిర పడాలని కలలు కన్నారు. తమ కుటుంబ సభ్యులను పెద్ద పెద్ద భవనాల్లో ఉంచాలని కోరుకున్నారు. అయితే వారు ఒకటి తలస్తే.. విధి మరొకటి తలచింది. చివరకు కోట్ల విలువ చేసే వజ్రం దొరికిన వారి జీవితం విచిత్రంగా మారింది. మరి.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
2017లో ఆఫ్రికా ఖండలోని సియోర్రా లియోన్ లో ఆండ్రో జాన్ సఫియా, కోంబా జాన్ బుల్ అనే ఇద్దరు యువకులు తినడానికి తిండి లేక దీనస్థితిలో ఉన్నారు. వీరితో సహా ఐదు మందితో కలిసి వజ్రాల కోసం వెతికే వారు. ఓ సారి ఈ బృందం నీళ్ల కుంటలో వెతకగా ఓ వజ్రం దొరికింది. 709 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం పేరు పీస్ డైమండ్. ఇది ప్రపంచంలోనే 14వ అతి పెద్ద వజ్రంగా రికార్డులోకెక్కింది. ఆ వజ్రం చూడటానికి రాయిలాగే ఉన్నా పట్టుకోగానే చాలా చల్లగా ఉందని ఆ యువకులిద్దరు చెప్పారు. ఇక
ఆండ్రో సఫియా,కోంబా జాన్ బుల్ ఇద్దరు పొట్ట కూటి కోసం స్థానిక పాస్టర్ ఇమాన్యూల్ పని చేశారు. ఆయన వారికి తిండిని స్పాన్సర్ చేసే వారు. ఈ పని చేసినందుకు వీళ్లకు జీతం ఇవ్వరు, కానీ రోజు తిండి పెడతారు. వజ్రం దొరికిన తరువాత వాళ్లు పాస్టర్ ఇమ్మాన్యూల్ కి తెలియజేశారు. ఆయన దానిని మార్కెట్ లో అమ్మకుండా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి అప్పగించిన ఆ వజ్రాన్ని వేలం వేశారు. ఇక వేలంలో ఆ వజ్రాని దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. వేలంలో ఆ వజ్రం 6.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే ఇండియన్ కరెన్సీలో 84 కోట్ల రూపాయలు ఉంటుంది.
పేదరికంలో మగ్గిపోతున్న వారికి ఈ వజ్రం వెలుగు ఇస్తుందని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. ఇక బృందానికి లభించిన డబ్బును అందరి సమానంగా పంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలుత అందరికి 80 వేల డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.66 లక్షల ఇవ్వనున్నారు. అంత డబ్బును చూస్తామని ఆండ్రో సఫియా కానీ, జాన్ బుల్ కానీ ఊహించలేదంట. తనకు వచ్చిన వాటాను చాలా రోజుల పాటు పట్టుకోకుండా, చూసుకుంటూ మురిసిపోయానని జాన్ బుల్ తెలిపాడు. ఆ తరువాత మంచి ఇళ్లు కొనుగోలు చేసేందుకు పట్టణంకి వెళ్లాడు. అలానే సఫియా చిన్నతనం నుంచి చదువులో ముందు ఉండే వాడు. అయితే పేదరికం కారణంగా చదువును మధ్యలో ఆపేశాడు. దీంతో వచ్చిన డబ్బుతో చదువుకునేందుకు కెనడా వెళ్లాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. ఓ ట్రావెల్ ఏజెంట్ కి డబ్బులు చెల్లించి..ఘనా దేశానికి చేరుకున్నారు. అక్కడ ఆరు నెలల పాటు ఉండి డబ్బులు ఖర్చు చేసుకున్నారు.
ఈ క్రమంలో సఫియాకు వీసా రాలేదు. దీంతో జాన్ బుల్ సొంత ఊరికి వెళ్లగా, సఫియా మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఉదయం డ్రైవర్ గా ని చేస్తూ..సాయంత్రం గుర్రాలకు కాపాల కాస్తు..వాటి మధ్యనే ఉంటానని సఫియా చెప్పుకొచ్చారు. అక్కడే ఉంటూ చదువుకుంటున్నాని తెలిపాడు. అయితే మొత్తంగా వజ్రం దొరికిన తరువాత తమ జీవితం ఊహించినట్లుగా మారలేదని, దుర్భర జీవితమే గడుపుతున్నట్లు సఫియా తెలిపాడు. అల్యూమినియం కంపెనీలు పని చేస్తున్నట్లు జాన్ బుల్ తెలిపాడు. వజ్రం దొరికింది వీరిద్దరికే అయినా పేరు మాత్రం పాస్టర్ కి వెళ్లిందని వాళ్లు వాపోయారు. ఇలా డబ్బులు దొరక, పేరు రాక..తమ జీవితం ఎప్పటి లాగానే ఉందని ఆ యువకులు అభిప్రాయ పడ్డారు.