Vinay Kola
Apollo Quiboloy: ఫిలిప్పీన్స్‌లోని దావోవ్ నగరంలో ఎన్నో దారుణాలు చేస్తున్న పాస్టర్ అపోలో క్విబోలాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రపంచం మొత్తానికి యజమానినని, దేవుడి బిడ్డనని ప్రకటించుకున్న అపోలో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నాడు.
Apollo Quiboloy: ఫిలిప్పీన్స్‌లోని దావోవ్ నగరంలో ఎన్నో దారుణాలు చేస్తున్న పాస్టర్ అపోలో క్విబోలాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రపంచం మొత్తానికి యజమానినని, దేవుడి బిడ్డనని ప్రకటించుకున్న అపోలో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నాడు.
Vinay Kola
అనేక మంది తాము దేవుళ్లమని, దేవుని వారసులని చెప్పుకుంటూ జనాలను బాగా మోసం చేస్తుంటారు. చాలా మంది బాబాలు, పాస్టర్లు అమాయక ప్రజలను నమ్మించి అతి దారుణంగా డబ్బులు దండుకున్న సంఘటనలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడి పేరు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తూ.. తమ అక్రమ కార్యకలాపాలు సాగిస్తూనే ఉంటారు. డబ్బు, డ్రగ్స్, అమ్మాయిలు, ఆయుధాలు, ఉగ్రవాదులని కూడా నడిపిస్తూ ఉంటారు. ఇలాగే ప్రజలని నమ్మించి ఓ పాస్టర్ అక్రమాలు చేశాడు. ఇక, అతడి దారుణాలకు తట్టుకోలేక ప్రభుత్వం ఆ పాస్టర్ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం ఏకంగా 2 వారాల పాటు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది.
ఫిలిప్పీన్స్ దేశంలోని దావోవ్ నగరంలో ఎన్నో రకాల దారుణాలు చేస్తున్న పాస్టర్ అపోలో క్విబోలాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఏకంగా 2 వేల మంది పోలీసులు వెళ్లడం గమనార్హం. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఇంత మంది ఎందుకని అనుకోవచ్చు. కానీ పాస్టర్ అపోలో బ్యాగ్రౌండ్ తెలిస్తే అంతమంది కూడా తక్కువేనని అనకమానరు. అతడు ఈ ప్రపంచం మొత్తానికి తాను యజమానినని, దేవుడి బిడ్డనని ప్రకటించుకున్నాడు. ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నాడు. ది కింగ్‌డమ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ పేరుతో 75 ఎకరాల్లో ఒక మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో 75 వేల సీట్ల కెపాసిటీ ఉన్న ఒక భారీ స్టేడియం, ఓ ప్రార్థనా మందిరం, ఇంకా 40 బిల్డింగ్‌లు కట్టించాడు. అతని మాయలో 70 లక్షల మంది అమాయకులు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అంతేకాదు ఇతనికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో బాగా దగ్గరి వ్యక్తి అట.
గతంలో రోడ్రిగో డ్యూటెర్టోకు ఆధ్యాత్మిక సలహాదారుడిగా కూడా ఈ అపోలో క్విబోలాయ్ వ్యవహరించాడు. అయితే రోడ్రిగో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవి నుంచి దిగాకా అపోలోకు ఇబ్బందులు మొదలయ్యాయి. 2021 లో అపోలోపై అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ చాలా అభియోగాలను మోపింది. చిన్న పిల్లలను సెక్స్ రాకెట్‌లోకి దింపడం, అమాయక ప్రజలను మోసగించి భారీగా డబ్బును స్మగ్లింగ్ చేయడం వంటి చాలా కేసులను ఇతనిపై పెట్టారు. అంతేగాక ఫిలిప్పీన్స్ నుంచి అతడు ఎందరో అమ్మయిలను అమెరికాకు తరలిస్తున్నట్లు యూఎస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ విచారణలో తేలింది. చారిటీ పేరుతో డబ్బును అక్రమంగా తరలించడం, తన వ్యక్తిగత మహిళా సహాయకురాళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం లాంటి అభియోగాలు కూడా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో పాస్టర్ అపోలో మీద తీవ్రంగా ఆగ్రహించిన కోర్టు ఎలాగైనా అతడిని అరెస్ట్ చేయాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పోలీసులు ఏకంగా 2 వారాల పాటు తీవ్రంగా ప్రయత్నించి ఆదివారం నాడు అతడ్ని అరెస్ట్ చేశారు. అపోలో సామ్రాజ్యాన్ని దాదాపు 2 వేలమంది పోలీసులు ముట్టడించారు. వారిని అడ్డుకునేందుకు అపోలో మద్దతుదారులు భారీగా ముందుకు వచ్చారు. అతడి సామ్రాజ్యంలోకి భద్రతా దళాలు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు హెలికాప్టర్లతో 2 వారాల పాటు ఈ ఆపరేషన్ చేశారు. అపోలో క్విబోలాయ్ అక్కడ ఓ బంకర్‌లో దాక్కున్నట్లు పోలీసులు కనుక్కున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ తో అతడు భూమి లోపల ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు.