iDreamPost
android-app
ios-app

Pakistan: ఊహించని ట్విస్ట్‌.. నవాజ్ షరీఫ్, బిలావల్ కాదు.. పాక్ ప్రధానిగా ఆయన!

  • Published Feb 14, 2024 | 9:03 AM Updated Updated Feb 14, 2024 | 9:40 AM

దాయాది దేశం పాకిస్తాన్‌లో కొన్ని రోజుల క్రితం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరూ ఊహించని వ్యక్తిని పాక్‌ ప్రధానిగా ప్రకటించారు. ఆ వివరాలు..

దాయాది దేశం పాకిస్తాన్‌లో కొన్ని రోజుల క్రితం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరూ ఊహించని వ్యక్తిని పాక్‌ ప్రధానిగా ప్రకటించారు. ఆ వివరాలు..

  • Published Feb 14, 2024 | 9:03 AMUpdated Feb 14, 2024 | 9:40 AM
Pakistan: ఊహించని ట్విస్ట్‌.. నవాజ్ షరీఫ్, బిలావల్ కాదు.. పాక్ ప్రధానిగా ఆయన!

ప్రపంచదేశాల్లో పరిస్థితుల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ మన పొరుగు దేశాల్లో చోటు చేసుకునే పరిణామాలు మనపై ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్తాన్‌లో చోటు చేసుకునే పరిణామాలు మన దేశంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తీవ్ర ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా దౌత్య పరమైన అంశాలు ప్రభావం అవుతాయి. ఇక కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగిన సంగతి తెలసిందే. అయితే ఈ ఎలక్షన్స్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాక్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమయ్యాయి.

ఇక పాక్‌ కొత్త ప్రధాని ఎవరూ అనే దాని గురించి విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. నవాజ్‌ షరీఫ్‌, బిలవాల్‌ బుట్టో పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రధాని పదవి విషయంలో నవాజ్‌ షరీఫ్‌ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. షరీఫే నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని భావించిన వేళ.. ఆయన అనూహ్యంగా తన సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా నామినేట్‌ చేస్తూ.. అందరికి షాక్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు ట్విటర్‌లో వివరాలు వెల్లడించారు. దీంతో పీఎంఎల్-ఎన్, పీపీపీ సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానిగా షెహబాబ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తమ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఔరంగజేబు తెలిపారు. అలాగే, నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌‌ను పంజాబ్‌ ప్రావిన్సుల ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఔరంగజేబు వెల్లడించారు. పీఎంఎల్‌-ఎన్‌ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దేశం సంక్షోభం నుంచి బయటపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. అయినా సరే ఈ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే పాక్‌లో ప్రభుత్వాన్ని నిర్ణయించేది ఆ దేశ సైన్యం అని ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో భాగంగానే సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పాకిస్తాన్‌లో కొలువు తీరబోతుంది.

అయితే, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్‌ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశించారని, ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు నవాజ్‌ షరీఫ్‌. ఇక 265 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్‌-ఎన్‌ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet