P Krishna
వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళ తాను ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక ఉంటుంది. కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల మాతృత్వానికి దూరమైతుంది. ఇటీవల సంతానోత్పత్తి ప్రక్రియ తల్లి కావాలనే తమ కోరిక నెరవేర్చుకుంటున్నారు.
వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళ తాను ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక ఉంటుంది. కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల మాతృత్వానికి దూరమైతుంది. ఇటీవల సంతానోత్పత్తి ప్రక్రియ తల్లి కావాలనే తమ కోరిక నెరవేర్చుకుంటున్నారు.
P Krishna
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం.. అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం అని ‘కుల గౌరవం’ చిత్రంలోని పాట ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పాట కొసరాజు రచించగా.. ఘంటసాల పాడారు. దేవుడు తనకు బదులుగా అమ్మను సృష్టించారని అంటారు పెద్దలు. నవమాసాలు మోసి.. పురిటినొప్పులు భరించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డను చూసి అప్పటి వరకు తాను పడ్డ కష్టాన్ని ఆ క్షణమే మర్చిపోతుంది. అమ్మ గురించి ఎంతోమంది కవులు వర్ణించారు. వెండితెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. తాజాగా 70 ఏళ్ల వయసులో ఓ మహిళ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫూర్తి వివరాల్లోకి వెళితే..
వివాహబంధంతో ఒక్కటైన దంపతులను పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. పెళ్లైన ప్రతి మహిళ తాను తల్లికావాలనే కోరిక ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మాతృత్వానికి దూరమై కుమిలిపోతుంటారు. ఓ మహిళ తాను తల్లి కావాలని ఆశ ఉండేది.. మొత్తానికి 70 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనిచ్చి తన కల నెరవేర్చుకుంది. సాధారణంగా మహిళలకు దాదాపు 45 ఏళ్ల వయసు వచ్చిందీ అంటే సంతానం కలిగే అవకాశం లేనట్లే అని అంటుంటారు. కానీ, 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా బిడ్డలకు జన్మినిచ్చ అరుదైన సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటిది ఘటన ఉగాండాలో చోటు చేసుకుంది. సఫీనా నముక్వాయ అనే 70 ఏళ్ల మహిళ పండంటి కవలలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా డెభ్బై ఏళ్ల వయసులో గర్భం దాల్చడం చాలా వరకు కష్టం.. కానీ తల్లి కావాలనే బలమైన కోరికతో ఉన్న సఫీనా నముక్వాయ ఐవీఎఫ్ ప్రక్రియలో గర్భం దాల్చి కలవ పిల్లలకు జన్మనిచ్చింది. ఉగాండా రాజధాని కంపాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సఫీనా బుధవారం, నవంబర్ 29న ఓక పాప, ఒక బాబు కి జన్మనిచ్చింది. ఇది ఒక అద్భుతమైన సంఘటన అని డాక్ట్ ఎడ్వర్డ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సంతానోత్పత్తి ప్రక్రియ ద్వారా తల్లి అయిన ఆమె ఆఫ్రికా దేశంలో అత్యంత పెద్ద వయసులో తల్లి అయిన మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. 2020 లో ఇదే ప్రక్రియ ద్వారా ఒక పాపకు జన్మినిచ్చింది సఫీనా. కానీ ఆ పాప కొద్ది రోజుల్లో కన్నుమూసింది. దీంతో మరోసారి ఆ ప్రయత్నం చేసి ఏకంగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సఫీనా ఆమె భర్త ఎంతో సంతోషంటో ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.