North Korea Issue:కీమ్‌తో గట్లుంటది మరి.. దక్షిణ కొరియాపై ప్రతీకారంతో వింతైన పని..

కీమ్‌తో గట్లుంటది మరి.. దక్షిణ కొరియాపై ప్రతీకారంతో వింతైన పని..

North Korea Issue: కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో ఆయన పేరు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. క్షిపనుల ప్రయోగంలో ఆయన్ని మించిన వారు ఉండరు అని అంటుంటారు. ఎప్పూడ వినూత్నంగా ఆలోచించే కిమ్ మరోసారి తన వింత ఆలోచనలతో వార్తల్లోకి ఎక్కారు.

North Korea Issue: కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో ఆయన పేరు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. క్షిపనుల ప్రయోగంలో ఆయన్ని మించిన వారు ఉండరు అని అంటుంటారు. ఎప్పూడ వినూత్నంగా ఆలోచించే కిమ్ మరోసారి తన వింత ఆలోచనలతో వార్తల్లోకి ఎక్కారు.

ప్రపంచంలో  ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వారు ఉండరు. ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు ఆయన చేస్తుంటారు.. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తుంటాయి. దక్షిణ కొరియాపై ఎప్పుడూ ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కిమ్. ఈ క్రమంలోనే కిమ్ దక్షిణ కొరియాకు వందల కొద్ది బెలూన్లు పంపించాడు.. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది. కిమ్ పంపించింది బెలూన్లే కదా అని ఈజీగా కొట్టిపడేయకండి.. ఇప్పుడు ఆ బెలూన్లే ఇంటర్నెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్ కే ఎలా వస్తాయబ్బా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ బెలూన్లో ఏమున్నాయో తెలుసా? వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా ఉభయ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. అగ్ర రాజ్యం అయిన అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరుచూ క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంటుంది. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ పొరుగు రాజ్యమైన దక్షిణ కొరియాపై ఓ వింతైన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈసారి క్షిపణులు, బాంబులతో కాదు..! ఓ ‘చెత్త’ ఐడియాతో వచ్చి కిమ్ తన పొరుగు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త, విసర్జన పదార్థాలను జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇటీవల దక్షిణ కొరియాలోని కొంతమంది నిరసనకారులు బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోకి లేఖలు పంపడం మొదలు పెట్టారు. దీనికి ప్రతీకార చర్యగా కీమ్ ఈ చెత్త దాడి చేసినట్లు తెలుస్తుంది.

దక్షిణ కొరియా భూభాగంలోకి భారీ బెలూన్లు వచ్చి చేరుతున్నాయని సైన్యం గుర్తించి వెంటనే అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాలతో పాటు సియోల్, జియోంగ్సాంగ్ ప్రాంతాల్లో రోడ్లపై ఇవి ఎక్కువగా కనిపించాయి. దాదాపు 260 భారీ బెలూళ్లు ఉత్తర కొరియా నుంచి వచ్చినట్లు సమాచారం. ఈ భారీ బెలూన్లలో ప్లాస్టీక్ సీసాలు, షూ భాగాలు, పేడ, ఇతర విసర్జాలు, బ్యాటరీలు ఉన్నట్లు దక్షిణ కొరియా సైనిక అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి దర్శనమిచ్చాయని వెల్లడించారు. చెత్త ఉన్న బెలూన్ల గురించి ఐక్యరాజ్య సమితి బృందానికి తెలియజేసింది. అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి వస్తువులతో ఇళ్లకు, ఎయిర్ పోర్ట్, రోడ్లకు ప్రమాదం అని దక్షిణ కొరియా సైనికులు అంటున్నారు. వీటి వల్ల ఉత్పన్నమయ్యే పర్యవసనాలకు కిమ్ దే బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర పనులు, అమానవీయ పనులు కిమ్ వెంటనే ఆపాలని హెచ్చరించింది.

Show comments