iDreamPost
android-app
ios-app

సొంత నానమ్మ ఇంటినే బుల్డోజర్లతో కూల్చేసిన కిమ్‌! ఎందుకంటే..?

Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ..తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానం వస్తే..సొంతవారిని కూడా వది పెట్టరు. గతంలో తన అధికారం విషయంలో అడుగ్గా ఉన్నాడని సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించాడు. తాజాగా మరో దారుణమైన పని చేశాడు.

Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ..తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానం వస్తే..సొంతవారిని కూడా వది పెట్టరు. గతంలో తన అధికారం విషయంలో అడుగ్గా ఉన్నాడని సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించాడు. తాజాగా మరో దారుణమైన పని చేశాడు.

సొంత నానమ్మ ఇంటినే బుల్డోజర్లతో కూల్చేసిన కిమ్‌! ఎందుకంటే..?

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కెల్లా ఉత్తరకొరియా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు కారణం..అక్కడి పాలకుడు, ఆయన పాలన విధానం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దారుణమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటు భయంకరమైన నియంతగా పేరు తెచ్చుకున్నారు.  ఆయన ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే మారుతూ ఉంటుంది. ఉత్తర కొరియాలో ఉన్నన్ని ఆంక్షలు, నిర్బంధాలను  ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఉండవనే చెప్పాలి. ఒక వైపు దేశం ఆకలితో అలమటిస్తున్నా కిమ్ తన రాజభోగాలకు, శత్రువులను మట్టుబెట్టేందుకు క్షిపణి పరీక్షలకు మాత్రం ఎలాంటి లోటు రానివ్వరు. తాజాగా కిమ్‌కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ..తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానం వస్తే..సొంతవారిని కూడా వది పెట్టరు. గతంలో తన అధికారం విషయంలో  అడుగ్గా ఉన్నాటనే అనుమానంతో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించాడు. అలాంటి వ్యక్తి తాజాగా తన సొంత నానమ్మపైనే ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమెకు చెందిన పెద్ద రాజభవనాన్ని బుల్డోజర్లతో కూల్చేయించాడు. కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్  మొదటి భార్య  కుమారుడి కొడుకే కిమ్ జోంగ్ ఉన్. కొంతకాలనికి  భార్య చనిపోవడంతో ఇల్ సంగ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కిమ్ సంగ్ ఏ.  ప్రస్తుతం ఆమె ఉండే భవనాన్నే  కిమ్ జోంగ్ ఉన్ కూల్చేయించాడని తెలుస్తోంది. తన  సంతానానికి వారసత్వం అప్పగించేందుకు యత్నాలు జరిగినట్లు తెలియడంతో అంతఃపుర గొడవలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రైన కిమ్ జోంగ్ ఇల్..తన సవతి తల్లిని 1994లో హాప్ జాంగ్ అనే భవనంలో నిర్బంధించారు. ఈ భవనం ఆదేశ రాజధాని నగరమైన ప్యాంగ్యాంగ్‌-ప్యాంగ్‌సంగ్‌కు మధ్యలోని ఓ పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడ దాదాపు 11 హెక్టార్లలో అటవీ ప్రాంతం, హాప్‌జాంగ్‌ నది ఉంది. అయితే ఎప్పుడూ కూడా కిమ్ జోంగ్ ఇల్ తన సవతి తల్లికి హాని తలపెట్టాలని చూడలేదు. ఆయన 2014లో మరణించాడు. ఈ క్రమంలో తాజాగా ఆ ప్యాలెస్ ను  కిమ్ జోంగ్ ఉన్ బుల్జోజర్ల సాయంతో నేలమట్టం చేయించాడు. శాటిలైట్ ద్వారా సేకరించే ఫోటోలో సైతం ఆ భవనం ఆనవాళ్లు కూడా లభించని విధంగా ఆ ప్రదేశాన్ని చదును చేయించాడు. గతంలో ఈ దేశ ఉన్నతాధికారుల భవనాలను కూడా కూల్చివేసిన చరిత్ర ఉంది. అయితే ఈ కూల్చివేతలకు గలకారణాలు మాత్రం తెలియడం లేదు.