Arjun Suravaram
Zayed International Airport: ఫ్లైట్ జర్నీ అంటే.. ఎయిర్ పోర్టులో అనేక రకాల తనిఖీలు ఉంటాయి. ముఖ్యంగా పాస్ పోర్టు, గుర్తింపు కార్డు ఉంటేనే విమానాశ్రయంలోకి అనుమతి ఉంటుంది. అయితే ఓ ఎయిర్ పోర్టులో మాత్రం పాస్ పోర్టు, ఐడీ కార్డు అవసరం ఉండదు.
Zayed International Airport: ఫ్లైట్ జర్నీ అంటే.. ఎయిర్ పోర్టులో అనేక రకాల తనిఖీలు ఉంటాయి. ముఖ్యంగా పాస్ పోర్టు, గుర్తింపు కార్డు ఉంటేనే విమానాశ్రయంలోకి అనుమతి ఉంటుంది. అయితే ఓ ఎయిర్ పోర్టులో మాత్రం పాస్ పోర్టు, ఐడీ కార్డు అవసరం ఉండదు.
Arjun Suravaram
నేటికాలంలో విమాన ప్రయాణాలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఫ్లైట్ లో జర్నీ అంటే చాలా వింతగా ఉండేది. అయితే ప్రస్తుత రోజుల్లో మాత్రం చాలా కామన్ అయింది. ఇక విమానాశ్రయంలోకి వివిధ రకాల తనిఖీలు ఉంటాయి. అలానే ఇతర దేశాలకు వెళ్లాలంటే.. పాస్ పోర్టు, వీసా అనేవి చాలా ముఖ్యం. విమానా ఎక్కేముందు ఎయిర్ పోర్టులో తనిఖీ చేసినప్పుడు ప్రధానంగా అడిగేవి ఇవే. అయితే ఓ అంతర్జాతీయ విమాశ్రయంలో మాత్రం పాస్ పోర్టు, ఐడీ కార్డులు అవసరంలేదు. అక్కడ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మరి.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
యూఏఈ రాజధాని అబుదాబిలో చాలా విమానాశ్రయాలు ఉంటాయి. అలానే ఇక్కడ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తుంటారు. ఇక్కడి ఎయిర్ పోర్టుల్లో అనేక రకలా మార్పులు చేస్తుంటారు.సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేస్తుంటారు. అలానే తాజాగా అబుదాబిలోని షేక్ జాయెద్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ఫేస్ ముఖ కవళికలను గుర్తించగల సాంకేతికతను ఈ విమానాశ్రయం ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త టెక్నాలజీ అమల్లోకి వస్తే..ఇకపై పాస్‌పోర్టు, ఐడీ కార్డు వంటి తనిఖీ చేయరు. అలానే ప్రయాణికులు అవి తీసుకురావాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.
జర్నీకి ముందు క్యూలో నిలబడి ప్రతి భద్రతా గేటు వద్ద డాక్యూమెంట్ చెకింగ్ చేసే పని ఇక ఉండదు. దీనికి బదులు ముఖాన్ని స్కాన్ చేసే టెక్నాలజీని వినియోగిస్తారు. దీని ద్వారా ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. ఒక వేళ ఈ టెక్నాలజీ అమలైతే.. ఫేషియల్ ఫ్యూచరిస్టిక్ సాంకేతికతను ఉపయోగించిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా షేక్ జాయెద్ ఇంటర్నెషనల్ అవతరించనుంది. యూనైటెడ్ ఏమిరేట్స్ లోని చాలా ప్రాంతాల్లో కొన్ని ఫ్యూచరిస్టిక్ ఫ్లైట్ హబ్‌లల్లో ఈ ఫేస్ స్కానర్ అమల్లో ఉంది. దీన్ని విమానాశ్రయ లాంజ్‌లు, డ్యూటీ ఫ్రీ షాప్‌లు, బోర్డింగ్ గేట్ల వద్ద ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయానికి వచ్చే ప్రతి ప్రయాణికుడి బయోమెట్రిక్‌ను స్కాన్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. మరి.. ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.