iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రో రైల్లో దారుణం.. నిద్రపోతూ మీద పడ్డాడని..

వీడియో: మెట్రో రైల్లో దారుణం.. నిద్రపోతూ మీద పడ్డాడని..

ఈ మధ్య కాలంలో మనుషుల్లో ఓపిక, సహనం బాగా తగ్గిపోయాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు పెంచుకుంటున్నారు. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఎదుటి వ్యక్తి చేసిన చిన్న పొరపాటుకు కూడా దండనే కరైన సమాధానంగా భావిస్తున్నారు. హింసా ప్రవృత్తి వైపు మళ్లుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి మెట్రో రైల్లో దారుణానికి ఒడిగట్టాడు. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి నిద్రపోతూ.. తన భుజాలపై వాలాడని గొడవపెట్టుకున్నాడు. తర్వాత అతడిపై దాడికి దిగాడు.

ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు మైట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరిలో 27 ఏళ్ల యువకుడు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ వ్యక్తి భుజంపైకి తూలాడు. దీంతో ఆ వ్యక్తి యువకుడితో గొడవ పెట్టుకున్నాడు. యువకుడి స్నేహితుడు కూడా గొడవలోకి దిగారు. ఇద్దరూ కలిసి ఆ వ్యక్తికి సమాధానం చెబుతూ ఉన్నారు.

అయితే, ఇద్దరి కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి యువకుడిపై దాడికి దిగాడు. తన మోచేత్తో బలంగా యువకుడి మూతిపై మూడు సార్లు కొట్టాడు. దీంతో యువకుడు మైకం వచ్చి పక్కకు తూలాడు. వ్యక్తి చేసిన పనితో ఆ‍గ్రహానికి గురైన యువకుడి స్నేహితుడు రంగంలోకి దిగాడు. ఆ వ్యక్తితో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ కొద్దిసేపు కుమ్ములాడుకున్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఈ  ఘటనపై యువకుడు, అతడి స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.