Venkateswarlu
Venkateswarlu
నార్నియా సినిమాలో క్లైమాక్స్‌లో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో అస్లాన్(సింహం) కథ సుఖాంతం అయిపోయిన తర్వాత రాజ్యాన్ని విడిచిపోతూ ఉంటాడు. సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటాడు. అప్పుడు లూసీ చూస్తూ ఉంటుంది. ఇది నార్నియా సినిమాలోని క్లైమాక్స్ సీన్.. రీలు. కానీ, నిజ జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ సింహం సముద్రం ఒడ్డున నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా ఆ ఫొటోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
‘‘ నార్నియా నిజంగా కనిపించినపుడు. గుజరాత్, అరేబియా సముద్ర తీరంలో లయన్ కింగ్ అలల్లో సేద తీరుతోంది’’అంటూ దానికో కాప్చన్ జోడించారు. ఆయన షేర్ చేసిన ఆ ఫొటోలో ఏషియన్ సింహం అలల మధ్య నిలబడి ఉంది. ఏషియన్ సింహాలకు సముద్రంలోని చేపల్ని తినటం అంటే ఇష్టమని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక, ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నిజంగా ఇలాంటి సీన్లు చూడ్డం చాలా అరుదు’’..
‘‘ నార్నియా సినిమా తర్వాత నేను ఇప్పుడే ఇలాంటి సీన్ చూస్తున్నా. సూపర్‌గా ఉంది’’.. ‘‘ సింహాలు ఇలా సముద్రం ఒడ్డున ఉండటం చూడ్డం ఇదే ఫస్ట్ టైం’’.. ‘‘ఫొటో ఎవరు తీశారో కానీ, సూపర్‌గా ఉంది’’.. ‘‘ ఆ లుక్ చాలు.. వేరే మాటలు అక్కర్లేదు. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, నార్నియా సినిమాలోని సీన్ నిజ జీవితంలో కనిపించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
When #Narnia looks real. A lion king captured enjoying tides of Arabian Sea on Gujarat coast. Courtesy: CCF, Junagadh. pic.twitter.com/tE9mTIPHuL
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 1, 2023