iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 723 అడవి జంతువుల మాంసం ప్రజలకు పంపిణీ!

Namibia Government: తాజాగా ఓ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 83 ఏనుగులను చంపి.. ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. మరి.. అత్యంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..

Namibia Government: తాజాగా ఓ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 83 ఏనుగులను చంపి.. ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. మరి.. అత్యంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..

ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 723 అడవి జంతువుల మాంసం ప్రజలకు పంపిణీ!

నిత్యం అనేక రకాల వార్తలు వివిధ సామాజిక మాద్యమాల ద్వారా ప్రత్యక్షమవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంతేకాక కొన్ని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు షాకి గురి చేస్తాయి. తాజాగా ఓ దేశ ప్రభుత్వం 83 ఏనుగులతో సహా 723 అడవి జంతువులను చంపి..వాటి మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.  వినడానికి ఆశ్చర్యంగా ఉన్న..ఇది మాత్రం నిజం. మరి.. అది ఏ దేశం, అలాంటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు తీవ్రమైన  కరువుతో అల్లాడిపోతుంటాయి. అలాంటి దేశాల్లో నమీబియా ఒకటి. అక్కడ జనాలు తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక విలవిల్లాడిపోతున్నరు. దీంతో ప్రజల ఆకలిని తీర్చేందుకు నమీబియా ప్రభుత్వం తప్ప ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆదేశంలో సంచరించే వన్యప్రాణాలను చంపి..ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ప్రకటించింది. మొత్తం 83 ఏనుగులతో సహా 723 వన్యప్రాణులను చంపి.. ఆ మాంసాన్ని సరఫరా నమీబియా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక చంపే వన్యప్రాణుల జాబితాలో 30 నీటి గుర్రాలు, 60 గేదేలు, 50 ఇంపాలా అనే ఒక రకమైన జింకలు ఉన్నాయి.  అలానే 100 బ్లూ వైల్డ్ బీస్ట్, 100 ఎలాండ్, 300 జీబ్రాలు, 83 ఏనుగులు కూడా ఉన్నాయని నమీబియా దేశ అటవీ పర్యాటక శాఖ వెల్లడించింది. అత్యంత అనుభవం ఉన్న వేటగాళ్లతో వీటిని చంపించనున్నట్లు తెలిపింది. నైరుతి ఆఫ్రికా ప్రాంతంలోని కరువుతో బాధ పడే ప్రజల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నమీబియా ప్రభుత్వం వివరించింది. నమీబియా దేశంలో కరువు నెలకొనడానికి  కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్య కారణం…అడవుల్లో వన్య ప్రాణుల సంఖ్య అని నమీబియా పర్యావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

జంతువులు అధికంగా ఉండి, నీటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. అవసరానికి మించి ఉన్న వన్య ప్రాణులను వధిస్తేనే దేశంలో నీటి వనరుల సమస్య తగ్గుతుందని భావిస్తున్నట్లు నమీబియా ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆదేశంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో 157 అటవీ జంతువులను వధించి, 56,800 కిలోల మాంసం ప్రజలకు పంపిణీ చేశారు. తమ దేశ రాజ్యాంగాన్ని అనుసరించే జంతువులను విధించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. సహజ వనరులను నమీబియా పౌరుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామని  ఆదేశ ప్రభుత్వం సమర్ధించుకుంది. మరి.. నమీబియా ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.