P Krishna
Moscow Attack: ఇటీవల ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఎంతోమంది అమాయకులను టార్గెట్ చేసుకొని మారణహోమం సృష్టిస్తున్నారు.
Moscow Attack: ఇటీవల ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఎంతోమంది అమాయకులను టార్గెట్ చేసుకొని మారణహోమం సృష్టిస్తున్నారు.
P Krishna
ప్రపంచ దేశాలకు ఉగ్రవాదులతో ఎంత ముప్పు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. లక్ష్యం ఏదైనా వారు సృష్టించే నరమేధానికి ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. మాస్కోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. స్థానిక క్రోకస్ సిటీ కన్సర్ట్ హాల్ లో కొంతమంది సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 140 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. అయితే మాస్కోలో ఉగ్రదాడి తమదే అని టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రదాడితో రష్యా ఒక్కసారే ఉలిక్కి పడింది. క్షతగాత్రులను హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఉగ్రవాదులు అమాయకులను టార్గెట్ చేసుకొని ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. రష్యా మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్ లో శుక్రవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. రష్యన్ రాక్ బ్యాండ్ ‘పిక్ నిక్’ ప్రదర్శన చూసేందుకు వందల మంది ప్రజలు తరలి వెళ్లారు. అంతలోనే కొంతమంది ఆగంతకులు హాల్ లోకి చొచ్చుకువెళ్లి మారణ హోమం సృష్టించారు. కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కొంతమంది ఉగ్రమూక పేలుడు పదార్ధాలను కాన్సర్ట్ హాల్ లోకి విసిరారు. దీంతో కాన్సర్ట్ హాల్ రూఫ్ కిందపడిపోయింది. మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతం మొత్తం మంటలు, పొగలతో కమ్ముకుంది. ఈ ఘటనలో 60 మందికి పైగా మరణించి ఉంటారని భావిస్తున్నారు.
హాల్ లో చిక్కుకున్న కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడి తర్వాత ఉగ్రవాదులు తప్పించుకుపారిపోయారు. దుండగులు ప్రయాణించిన కారును పట్టుకునేందుకు అన్ని సీసీ ఫుటేజ్ లు చెక్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై అధ్యక్షులు పుతిన స్పందిస్తూ ఈ ఘటనకు పాల్పపడిన వారు ఎంతటి వారైనా సరే మూల్యం తప్పించుకోక తప్పదు అని అన్నారు.