iDreamPost
android-app
ios-app

గ్రామంపై బాంబు దాడి.. పిల్లలతో సహా 17 మంది మృతి!

Myanmar: ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  బాంబుల దాడులు జరగుతునే ఉంటాయి. ఈ దాడుల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఓ గ్రామంపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో

Myanmar: ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  బాంబుల దాడులు జరగుతునే ఉంటాయి. ఈ దాడుల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఓ గ్రామంపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో

గ్రామంపై బాంబు దాడి.. పిల్లలతో సహా 17 మంది మృతి!

ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  బాంబుల దాడులు జరగుతునే ఉంటాయి. మన దేశంలో కూడా ఈ అప్పుడప్పుడు బాంబు పేలుడు ఘటనలు జరుగుతుంటాయి. ఉగ్రవాదులు, తిరుగు బాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారు. ఈ పేలుడు ఘటనల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో అంగవైకల్యం ఏర్పడి..జీవితాన్ని నరకయాతన గా అనుభవిస్తుంటారు. తాజాగా ఓ గ్రామంపై బాంబు దాడి జరిగింది.  ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా 17 మంది మృతి చెందారు. ఈ ఘటన మయన్మార్ లో చోటుచేసుకుంది. మానవ హక్కుల సంఘం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.

భారత సరిహద్దుకు దక్షిణంగా ఉన్న మయన్మార్ దేశంలోని సగయింగ్ ప్రాంతంలోని బాంబు దాడి జరిగింది. సగయింగ్ ప్రాంతంలోని కనన్ గ్రామంలో ఉదయం జరిగిన వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో పిల్లలతో సహా 17 మంది మృతి చెందారు. అంతేకాక దాదాపు 20 మంది గాయపడ్డారని సమాచారం. ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య అనుకూల నేత ఆంగ్ సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం తొలగించింది సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  తరచూ ఇక్కడ దాడులు, ప్రతి దాడులు జరుగుతుంటాయి. గతేడాది ఏప్రిల్ లో  మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో  దాదాపు100 మంది మరణించారు.

సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి వీరు వెళ్లినట్లు సమాచారం. మయన్మార్‌ వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్‌ కూడా ఖండించారు. వోల్కర్ టర్క్ మాట్లాడుతూ.. పౌరులపై దాడులకు సంబంధించిన రిపోర్టులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ పాఠశాల పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2021లో మయన్మార్ ఆంగ్ సాన్ సూకీపై  సైన్యం దేశంలో తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత ఆమెను దించేసి.. సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి మయన్మార్‌లో సైనిక పాలన జరుగుతుంది. వారి పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కూడా కొనసాగుతున్నాయి.

అదే సమయంలో ఆందోళనకారులపై సైన్యం చర్యలు తీసుకుంటోంది. ఈ తిరుగుబాటు కారణంగా మూడు వేల మందికి పైగా పౌరులు మరణించారు. వైమానిక దాడిలో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఆఫీస్ కూడా ధ్వంసమైంది. ఈ దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 150 మందికి పైగా ప్రజలు వేదిక వద్ద ఉన్నారు. వారిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మిలటరీ పాలన వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. తాజాగా గ్రామంపై జరిగిన బాంబు దాడిలో 17 మంది మృతి చెందారు. మరి.. మయన్మార్ లో జరుగుతున్న ఈ దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.