P Krishna
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా టెక్నాజీ ఎంతో పెరిగిపోయింది. సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. నిత్యం మానవాళికి పనికి వచ్చే అద్భతమైన పరికరాలను ఆవిష్కరిస్తున్నారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా టెక్నాజీ ఎంతో పెరిగిపోయింది. సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. నిత్యం మానవాళికి పనికి వచ్చే అద్భతమైన పరికరాలను ఆవిష్కరిస్తున్నారు.
P Krishna
ఇటీవల ప్రపంచ దేశాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసు మొదలు వృద్దుల వరకు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూస్తున్నారు. ఎక్కువ సమయం వ్యాయామం, జాగింగ్,డ్యాన్సులు లాంటివి చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పడి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. సకాలంలో సీపీఆర్ చేసి బతికించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే.. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే లెక్క. అయితే టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇటీవల గుండెపోటుకి గురైన వారు తాము ధరించిన స్మార్ట్ ఫోన్ సకాలంలో అలర్ట్ కావడంతో ప్రాణాపయస్థితి నుంచి బయటపడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ కంపెనీ సీఈఓ ప్రాణాలు స్మార్ట్ వాచ్ కాపాడింది..ఈ ఘటన యూకేలో చోటు జరిగింది. వివరాల్లోకి వెళితే..
యూకేలోని హాకీ వెల్స్ సంస్థ సీఈవొ పాల్ వాపమ్ స్వాన్సీలోని మోరిస్టాన్ ప్రాంతంలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తున్నాడు. పాల్ పరుగెత్తుతుండగా హఠాత్తుగా ఛాతిలోనొప్పి రావడంతో.. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అయ్యింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. గుండె బిగుతుగా అనిపించడంతో ఒక్కసారే కుప్పకూలిపోయాడు. అదృష్టం కొద్ది ఆయన ధరించిన స్మార్ట్ వాచ్ ద్వారా భార్య లారాకు ఫోన్ చేయగలిగాడు. వెంటనే ఆమె అక్కడికి చేరుకొని తన కారులో నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో డాక్టర్ ట్రీట్ మెంట్ మొదలు పెట్టి అతని ధమనుల్లో ఒకదానిలో రక్తం సరఫరా కాకుండా అడ్డుపడటంతో హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. వెంటనే కార్టియాక్ సెంటర్ లోని లేబోరేటరికీ తరలించి బ్లాక్ అయిన ధమనిని క్లియర్ చేశారు. ఆరు రోజుల తర్వాత పాల్ వాపమ్ కోలుకున్న తర్వాత ఇంటికి పంపించారు.
తన అనుభవం గురించి హాకీ వెల్స్ సంస్థ సీఈవొ పాల్ వాపమ్ మాట్లాడుతూ.. ఇది నిజంగా ఓ అద్భుతం. టెక్నాలజీ ఒక మనిషి ప్రాణాలు కాపాడిందని చెప్పడానికి నా జీవితం ఓ ఉదాహారణ. నేను అధిక బరువు లేను.. ఎప్పుడూ ఫిట్ గానే ఉంటాను. నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు.. కానీ నాకు జరిగిన అనుభవం తల్చుకుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నాకు అండగా నిలిచిన నా భార్యకు, ఆస్పత్రి సిబ్బందికి నా కృతజ్ఞతలు. గతంలో కూడా కొంతమంది వాకింగ్, రన్నింగ్ చేసే సమయంలో హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించిన వెంటనే స్మార్ట్ వాచ్ లు గుర్తించి అప్రమత్తం చేయడంతో వారి బంధువులకు ఫోన్ చేసి ప్రాణాలతో బయటపడ్డారు. స్మార్ట్ వాచ్ ల్లో ఉండే హార్ట్ రేట్, ఈసీజీ వంటి సెన్సార్లు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అలర్ట్ చేస్తుంది. ఏది ఏమైనా ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు స్మార్ట్ వాచ్ కాపాడిన వార్త సోషల్ మీడియాలో అయ్యింది.