iDreamPost
android-app
ios-app

ఈగను చంపి కన్ను పోగొట్టుకున్న వ్యక్తి ! అసలేం జరిగిదంటే..!

Loses Eye After Swatting Fly: టైమ్ బాగాలేకుంటే.. తాడే పామై కాటేస్తుందని పెద్దలు అంటారు. అచ్చం అలాంటి పరిస్థితే ఓ వ్యక్తి ఎదురైంది. ఈగను కొట్టిన పాపానికి ఏకంగా కన్నునే కోల్పోయాడు. అసలు ఏం జరిగిందంటే...

Loses Eye After Swatting Fly: టైమ్ బాగాలేకుంటే.. తాడే పామై కాటేస్తుందని పెద్దలు అంటారు. అచ్చం అలాంటి పరిస్థితే ఓ వ్యక్తి ఎదురైంది. ఈగను కొట్టిన పాపానికి ఏకంగా కన్నునే కోల్పోయాడు. అసలు ఏం జరిగిందంటే...

ఈగను చంపి కన్ను పోగొట్టుకున్న వ్యక్తి ! అసలేం జరిగిదంటే..!

ఎప్పడు ఎటువైపు నుంచి మనిషికి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఎవ్వరం చెప్పలేము. ఇంట్లో కూర్చుకున్న కూడా కొన్ని సార్లు ప్రమాదం వచ్చి పలకరిస్తుంది. ఇక కొన్ని రకాల ఘటనలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి  ఈగను చంపడంతో కంటి చూపును కోల్పోయాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజమే. అయితే ఈ ఘటన చైనాలో జరిగింది. అసలేం జరిగిందో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఏదైనా ఈగ కుడితే కాస్తా అనారోగ్యానికి గురవుతుంటాయి. కాస్తా మందులు వేసుకోగానే తిరిగి యథాస్థితికి వస్తాము. అయితే చైనాలోని షెన్ జెన్ అనే నగరంలో మాత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ముఖంగా వాలిన ఈగను చంపడంతో అతడు ఏకంగా కంటినే కోల్పోయాడు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌ అనే పట్టణంలో వూ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల ఒక రోజు వూ ముఖంపై ఈగ వాలుతూ ఇబ్బంది పెట్టింది. దీంతో చాలా సేపు దానిని తోలేసిన వూ.. కాసేపటికి విసుగు చెందాడు. దీంతో తన ముఖంపై వాలిన ఆ ఈగను అతడు చంపేశాడు.

ఈగను చంపిన ఓ గంట తరువాత అతని ఎడమ కన్ను ఎరుపు రంగులోకి మారింది. అలానే వెంటనే తీవ్ర నొప్పి రావడంతో డాక్టర్లను సంప్రదించాడు. అయితే అతడికి చికిత్స చేసినప్పటికీ.. కంటి చుట్టుపక్కల ప్రాంతంలో పుండుగా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎన్ని మందులు తీసుకున్న రోజు రోజుకు వూ పరిస్థితి మరింత దిగజారింది. కంటి ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరుగుతుందని డాక్టర్లు గుర్తించారు. కంటికి సోకిన ఇన్ ఫెక్షన్ మెదడుకు వ్యాప్తి చెందుతుందని, కాబట్టి ఎడమ కనుగుడ్డును తొలగించాలని వైద్యులు సూచించారు. దీంతో వారి మాట ప్రకారం.. అతడు ఇన్ ఫెక్షన్ సోకిన ఎడమ కన్నును తీయించుకునేందుకు సిద్దమయ్యాడు.

ఇక ఆపరేషన్ చేసిన వైద్యులు వూ ఎడమ కన్నును తొలగించారు. అతడు కంటి చూపు పోవడానికి డ్రైన్ ఫ్లై అని వైద్యులు గుర్తించారు. దాని లార్వా నీటిలోనే నివసిస్తుందని సమాచారం. స్నానపు గదులు, వంటశాలలు, సింక్‌లు వంటి.. తడిగా, చీకటిగా ఉండే ప్రదేశాలలో ఈ జీవి ఎక్కువగా జీవనం సాగిస్తుందట. ఈగలు, దోమలు వంటి కీటకాలు కంటి వద్దకు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. వాటిని కంటి ప్రదేశంలోనే కొట్టి చంపడం వంటి చేయకూడనది తెలిపారు. మొత్తంగా ఓ ఈగను చంపినందుకూ.. వూ ఏకంగా తన కంటినే కోల్పోయాడు.